హీట్ ఎక్స్చేంజర్ మరమ్మతుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్, లీబ్‌హెర్-ఏరోస్పేస్ భాగస్వామ్యం

- February 12, 2025 , by Maagulf
హీట్ ఎక్స్చేంజర్ మరమ్మతుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్, లీబ్‌హెర్-ఏరోస్పేస్ భాగస్వామ్యం

హైదరాబాద్: జీఎంఆర్ ఏరో టెక్నిక్, భారతదేశంలోని ప్రముఖ ఎంఆర్‌ఓ ప్రొవైడర్, లీబ్‌హెర్-ఏరోస్పేస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది, ఇది భారతీయ విమానయాన రంగంలో మరమ్మతుల సామర్థ్యాలను మెరుగుపరిచే దిశగా ముందడుగు.

ఈ ఒప్పందం కింద, జీఎంఆర్ ఏరో టెక్నిక్ లీబ్‌హెర్-ఏరోస్పేస్‌తో కలిసి హీట్ ఎక్స్చేంజర్ల కోసం అధునాతన మరమ్మతు సేవలను అందించనుంది.లీబ్‌హెర్ యొక్క సాంకేతిక నైపుణ్యం మరియు జీఎంఆర్ యొక్క ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నిపుణులైన మానవవనరులను అనుసంధానం చేసి, భారతదేశం మరియు పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎయిర్‌లైన్స్‌కి అధిక నాణ్యతతో కూడిన,చౌకబారు మరమ్మతు పరిష్కారాలను అందించనున్నారు.ఈ భాగస్వామ్యం స్థానిక ఎంఆర్‌ఓ సామర్థ్యాలను పెంపొందించడానికి, అలాగే భారత ప్రభుత్వ "మేక్ ఇన్ ఇండియా" లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తోడ్పడుతుంది.

ఈ సందర్భంగా జీఎంఆర్ ఏరో టెక్నిక్ అధ్యక్షుడు & అకౌంటబుల్ మేనేజర్ అశోక్ గోపినాథ్ మాట్లాడుతూ, "లీబ్‌హెర్-ఏరోస్పేస్‌తో మా భాగస్వామ్యం ప్రపంచ స్థాయి ఎంఆర్‌ఓ సేవలను అందించాలనే మా కట్టుబాటును మరింత బలపరిచింది.లీబ్‌హెర్ సాంకేతిక నైపుణ్యాన్ని మా అధునాతన మౌలిక సదుపాయాలతో కలిపి, ప్రాంతంలోని A320 ఆపరేటర్లకు వేగవంతమైన, సమర్థవంతమైన మరమ్మతు పరిష్కారాలను అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం."

లీబ్‌హెర్-సింగపూర్ జనరల్ మేనేజర్ ఎక్కెహార్డ్ ప్రాచ్ మాట్లాడుతూ, "భారతీయ ఎయిర్‌లైన్‌లకు లీబ్‌హెర్ OEM నాణ్యత సేవలను అందించేందుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్‌తో భాగస్వామ్యం చేయడం మాకు ఆనందంగా ఉంది. ఈ ఒప్పందం ప్రాంతీయ ఎంఆర్‌ఓ సామర్థ్యాలను పెంపొందించడంలో కీలక భూమిక పోషిస్తుంది."

టౌలూస్ (ఫ్రాన్స్‌)లో ప్రధాన కార్యాలయం ఉన్న లీబ్‌హెర్-ఏరోస్పేస్ & ట్రాన్స్‌పోర్టేషన్ SAS లీబ్‌హెర్ గ్రూప్‌లోని 13 ఉత్పత్తి విభాగాలలో ఒకటి. ఇది ఏరోస్పేస్ మరియు రవాణా పరిశ్రమలకు అధిక నాణ్యత గల ఆన్-బోర్డ్ సొల్యూషన్లను అందించే ప్రముఖ సంస్థ. లీబ్‌హెర్ సుస్థిర రవాణాకు తోడ్పడే నూతన ఆవిష్కరణలతో, అత్యుత్తమ సేవలు మరియు అసాధారణ పనితీరుతో ఈ రంగంలో విశేషంగా సేవలు అందిస్తోంది.

లీబ్‌హెర్ ఎయిరోస్పేస్ సివిల్ మరియు డిఫెన్స్ వినియోగదారులకు పర్యావరణ నియంత్రణ, థర్మల్ మేనేజ్‌మెంట్, ఫ్లైట్ కంట్రోల్, ల్యాండింగ్ గియర్స్, ఆన్-బోర్డ్ ఎలక్ట్రానిక్స్ వంటి పరిష్కారాలను అందిస్తుంది. రైల్ వాహనాల కోసం తాపన, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్, బ్రేకింగ్, డాంపింగ్, యాక్సిల్ స్టీరింగ్ మరియు లెవలింగ్ వంటి హైడ్రాలిక్ సిస్టమ్‌లను అందిస్తోంది. అదనంగా, వాణిజ్య వాహనాల రంగంలో ట్రైలర్ కూలింగ్ సిస్టమ్‌లను కూడా లీబ్‌హెర్ అందిస్తుంది.

జీఎంఆర్ ఏరో టెక్నిక్, జీఎంఆర్ ఎయిర్ కార్గో & ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కి చెందిన విభాగంగా, భారతదేశపు అతిపెద్ద మూడవ పక్ష (థర్డ్ పార్టీ) ఎంఆర్‌ఓ సేవల ప్రొవైడర్. ఇది నెరో బాడీ విమానాలకి బేస్ మెయింటెనెన్స్, స్ట్రక్చరల్ రిపేర్స్, అవియోనిక్స్ అప్‌గ్రేడ్‌లు, కంపోనెంట్ రిపేర్స్ మరియు ఎయిర్‌క్రాఫ్ట్ పెయింటింగ్ వంటి ప్రత్యేక సేవలను అందిస్తుంది.

భారతదేశంలోని 14 ఎయిర్‌పోర్ట్‌లు మరియు నేపాల్‌లోని 1 ఎయిర్‌పోర్ట్‌లో లైన్ మెయింటెనెన్స్ సేవలు అందిస్తూ 50+ ఎయిర్‌లైన్స్/కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ఇది EASA, FAA, DGCA, DGAQA వంటి 30కి పైగా అంతర్జాతీయ రెగ్యులేటరీ సంస్థల అనుమతులను పొందింది.

జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ DGCA & EASA ఆమోదిత ఏయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ లైసెన్స్‌లు మరియు కార్పొరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. ఇది ఏరోస్పేస్ రంగానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెనసే ‌గా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది, పరిశ్రమకు సిద్ధమైన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను తయారు చేయడమే దీని ప్రధాన లక్ష్యం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com