ఒమన్ లో సోషల్ మీడియాను ఎదుర్కోవడంపై వర్క్ షాప్..!!
- February 14, 2025
మస్కట్: సమాచార మంత్రిత్వ శాఖ "సోషల్ మీడియాతో వ్యవహరించడానికి జాతీయ ఫ్రేమ్‌వర్క్ వైపు" అనే అంశంతో వర్క్‌షాప్‌ను నిర్వహించనుంది. రెండు వారాల వర్క్‌షాప్ ఫిబ్రవరి 16న “ఒమన్ విజన్ 2040 ఇంప్లిమెంటేషన్ ఫాలో-అప్ యూనిట్” సంబంధిత ఇతర విభాగాల సహకారంతో నిర్వహించబడుతుంది. సోషల్ మీడియా వాతావరణంలో పిల్లల పెంపకం పట్ల కుటుంబం , సమాజం బాధ్యతపై హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ సూచనలు నేపథ్యంలో వర్క్‌షాప్ ను నిర్వహించాలని నిర్ణయించారు.
సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయం (SQU), నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) సహకారంతో సంబంధిత పరిశోధన/అధ్యయనాలను సిద్ధం చేయడంలో విద్యావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, మీడియా నిపుణులు ఈ వర్క్‌షాప్ లో పాల్గొంటున్నారు. సమాచార మంత్రిత్వ శాఖ.. ఒమన్ విజన్ 2040 ఇంప్లిమెంటేషన్ ఫాలో-అప్ యూనిట్ , సంబంధిత విభాగాలకు చెందిన బృందం ఒమన్ విజన్ 2040 ప్రాధాన్యతలకు ఎదురయ్యే స్మార్ట్ లక్ష్యాలు, అల్గారిథమ్‌లు, సవాళ్లతో కూడిన వ్యూహాత్మక విధానాన్ని అభివృద్ధి చేసింది. సోషల్ మీడియా సానుకూల అంశాలను మెరుగుపరచడానికి, సమాజంపై ప్రతికూల ప్రభావాలను పరిమితం చేయడానికి సంబంధిత అధికారులచే అమలు చేయబడే అనేక కార్యక్రమాలలో భాగంగా వర్క్‌షాప్ ను నిర్వహిస్తున్నట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







