సూక్ వాకిఫ్ ఇంటర్నేషనల్ డేట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- February 14, 2025
దోహా: సూక్ వాకిఫ్‌లోని తూర్పు అరేనాలో మూడో సౌక్ వకీఫ్ ఇంటర్నేషనల్ డేట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఖతార్, సౌదీ అరేబియా, యెమెన్, అల్జీరియా, ఒమన్, పాకిస్థాన్, సూడాన్‌లకు చెందిన 95 కంపెనీలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 24 వరకు కొనసాగుతుంది. సందర్శకులు అత్యుత్తమ రకాల డేట్స్, వాటి వివిధ ఉత్పత్తుల గురించి తెలుసుకోవడానికి అవకావశం కల్పిస్తుంది. ఎగ్జిబిషన్ ప్రతిరోజూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. ఖర్జూరాల తయారీ, ప్యాకేజింగ్‌లో మెరుగుదలలతో పాటు గొప్ప అనుభవాన్ని అందిస్తుందని ఎగ్జిబిషన్ జనరల్ సూపర్‌వైజర్ ఖలీద్ సైఫ్ అల్ సువైదీ తెలిపారు. రమదాన్ లో ముఖ్యమైన భాగంగా ఖర్జూరాలకు డిమాండ్ పెరుగుతున్నప్పుడు, పవిత్రమైన మాసానికి ముందు మూడవ సూక్ వాకిఫ్ అంతర్జాతీయ డేట్స్ ప్రదర్శనకు కొనుగోలుదారులు తరలివస్తారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







