అజ్మాన్‌లో హగ్ అల్ లైలా ఉత్సవాలకు ముందు ఆహార భద్రత తనిఖీలు..!!

- February 14, 2025 , by Maagulf
అజ్మాన్‌లో హగ్ అల్ లైలా ఉత్సవాలకు ముందు ఆహార భద్రత తనిఖీలు..!!

యూఏఈ: హాగ్ అల్ లైలా అని పిలువబడే షాబాన్ అర్ధరాత్రి జరిగే ఉత్సవాలను పురస్కరించుకొని అజ్మాన్ మునిసిపాలిటీ,  ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆహార సంస్థలలో తనిఖీలను పెంచింది.  సాంప్రదాయ వేడుకల సమయంలో స్వీట్లు, జ్యూస్‌లు, పండుగ విందులలో ఫ్యామిలీలు ఎక్కువగా పాల్గొంటాయి.  మార్కెట్‌లో లభించే ఆహార ఉత్పత్తుల నాణ్యత, భద్రతను ధృవీకరించడానికి అధికారులు తనిఖీలను వేగవంతం చేశారు. ఆహార నిర్వహణ, నిల్వ, పరిశుభ్రత చర్యలు నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీలు చేస్తున్నారు. తద్వారా ఆరోగ్య ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా చేయడం ఈ తనిఖీల లక్ష్యమని డాక్టర్ ఖాలీద్ పేర్కొన్నారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ స్థానిక మార్కెట్‌లలో విస్తృత సర్వేలు నిర్వహించిందని, ప్రధాన వాణిజ్య కేంద్రాలు, సూపర్ మార్కెట్‌ల నుండి ఆహార నమూనాలను సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

స్వీట్లు, జ్యూస్‌లు, ప్రమోషనల్ ఆఫర్‌ల వంటి ఉత్పత్తులు సాధారణంగా హగ్ అల్ లైలా సమయంలో పెద్ద మొత్తంలో వినియోగిస్తారని, సేకరించిన నమూనాలను మున్సిపాలిటీ సెంట్రల్ ఫుడ్ లాబొరేటరీలలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.  ఆహారపదార్థాల ద్వారా వచ్చే వ్యాధులను నివారించడంలో ఈ తనిఖీలు కీలకమని అధికారులు తెలిపారు. మరోవైపు ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నివాసితులు ఏవైనా ఆహార భద్రత సమస్యలను మున్సిపాలిటీ హాట్‌లైన్‌కు టోల్-ఫ్రీ 80070లో నివేదించాలని కోరారు. లేదా [email protected] కి ఇమెయిల్ కూడా చేయవచ్చని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com