కువైట్ దౌత్యవేత్తలకు ఇండియాలో శిక్షణ..!!
- February 14, 2025
కువైట్: భారతదేశంలోని కువైట్ రాయబారి మిషాల్ ముస్తఫా అల్-షెమాలి.. షేక్ సౌద్ అల్-నాసర్ అల్-సబా డిప్లొమాటిక్ ఇన్‌స్టిట్యూట్, సుష్మా స్వరాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాల గురించి చర్చించారు. సుష్మా స్వరాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ డీన్ రాజ్ కుమార్ శ్రీవాస్తవను ఆయన కలిసారు. అనంతరం మాట్లాడుతూ.. దౌత్య రంగంలో అత్యుత్తమ శిక్షణ పద్ధతులు, విద్యను మార్పిడి చేయడం, రెండు సంస్థల విధులు, కార్యకలాపాలను పంచుకోవడం ద్వారా కువైట్ - భారతీయ సంస్థల మధ్య సంబంధాలలను ప్రోత్సహించడంపై చర్చించారు.
ఈ సమావేశంలో ఈ నెలలో ఇండియన్ సుష్మా స్వరాజ్ డిప్లొమాటిక్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగే డిప్లమాటిక్ కోర్సులో కువైట్ బృందం పాల్గొనడం, దానికి సంబంధించిన ఏర్పాట్లపై తాను దృష్టి సారించినట్లు రాయబారి తెలిపారు. షేక్ సౌద్ అల్-నాసర్ అల్-సబాహ్ డిప్లొమాటిక్ ఇన్‌స్టిట్యూట్ - సుష్మా స్వరాజ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ సర్వీస్ మధ్య 2013లో దౌత్య జ్ఞాన మార్పిడి రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి, ప్రత్యేక కార్యక్రమాలు, కోర్సులు, వివిధ విద్యా కార్యకలాపాల నిర్వహణలో పాల్గొనేందుకు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. డిసెంబరు 2024లో భారత ప్రధాని నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా, ఢిల్లీలోని భారత సుష్మా స్వరాజ్ డిప్లొమాటిక్ ఇన్‌స్టిట్యూట్‌లో కువైట్ దౌత్యవేత్తలకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని ఇరు పక్షాలు స్వాగతించాయి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







