IPL లవర్స్ కి బ్యాడ్ న్యూస్..
- February 15, 2025
త్వరలో ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ మ్యాచుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.ఎందుకంటే.. జియో సినిమాలో(ఇప్పుడు జియో హాట్ స్టార్) ఫ్రీ స్ట్రీమింగ్ బంద్ కానుంది. ఇకపై ఐపీఎల్ మ్యాచ్ లు చూడాలంటే డబ్బులు కట్టాల్సిందే.
జియో సినిమా, డిస్నీ హాట్ స్టార్ విలీనమై జియో హాట్ స్టార్ గా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది జియో హాట్ స్టార్. ఆ గైడ్ లైన్స్ ప్రకారం.. ఇకపై మ్యాచ్ లు చూడాలంటే సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. 3 నెలలకు గాను 149 రూపాయలు చెల్లించాలి. అదే యాడ్ ఫ్రీ ఆప్షన్ కావాలంటే 499 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. కాగా, మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడనున్నాయి.
టీ20 టోర్నమెంట్ డిజిటల్ రైట్స్ ని ఐదేళ్ల కాలానికి జియో సినిమా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 2023లో ఈ ఒప్పందం చేసుకుంది. జియో హాట్ స్టార్ ఫామ్ కాకముందు జియో సినిమాలో ఫ్రీగా ఐపీఎల్ మ్యాచులు చూసే వారు. అయితే జియో సినిమా, డిస్నీ హాట్ స్టార్ మెర్జర్ తో కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చారు.
కొత్తగా ఏర్పడిన జియో హాట్ స్టార్..ఐపీఎల్ ను పూర్తి ఉచితంగా స్ట్రీమింగ్ చేసే అవకాశం ఇవ్వడం లేదు. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం..మ్యాచ్ ని కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉచితంగా చూసే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.పూర్తి మ్యాచ్ ని చూడాలంటే మాత్రం సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఉచితంగా చూసే సమయం అయిపోగానే..సబ్ స్క్రిప్షన్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఇందులో 149 రూపాయలతో ప్లాన్ ప్రారంభం అవుతుంది.
కాగా.. డిస్నీ హాట్ స్టార్ సబ్ స్క్రైబర్లు ప్రస్తుత ప్లాన్లతో కంటిన్యూ అవుతారు. మూడు నెలల వ్యవధికి గాను మొబైల్(రూ.149), సూపర్ (రూ.299), ప్రీమియం(యాడ్ ఫ్రీ రూ.399) ప్లాన్లు కంటిన్యూ అవుతాయి. జియో సినిమా ప్రీమియం సబ్ స్క్రైబర్లు మాత్రం జియో హాట్ స్టార్ ప్రీమియంకు మైగ్రేట్ అవుతారు. జియో సినిమా యూజర్లు ఆటోమేటిక్ గా ప్రీమియం యాక్సెస్ కి అప్ గ్రేడ్ అవుతారు.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!