వెటర్నరీ ఉల్లంఘనలకు Dh500,000 వరకు జరిమానా..!!
- February 15, 2025
యూఏఈ: పశువైద్య ఉల్లంఘనలపై అజ్మాన్ మునిసిపాలిటీ కఠినంగా వ్యవహారించనుంది. ఎమిరేట్‌లోని వెటర్నరీ ప్రత్యేక కంపెనీల ద్వారా గడువు ముగిసిన వెటర్నరీ ఉత్పత్తులను సురక్షితంగా పారవేసేందుకు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అజ్మాన్ మునిసిపాలిటీ.. వాతావరణ మార్పు, పర్యావరణ మంత్రిత్వ శాఖ (MoCCAE) సహకారంతో నియంత్రణ సమ్మతి, పర్యావరణ భద్రత ప్రాముఖ్యతను తెలియజేసింది. వెటర్నరీ ఉత్పత్తులపై నిర్దేశిత ఉల్లంఘనలకు కఠినంగా చర్యలు ఉంటాయని అజ్మాన్‌లోని పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఖలీద్ మొయీన్ అల్ హోసానీ హెచ్చరించారు. క్లినిక్‌లు, ఫార్మసీలతో సహా పశువైద్య సౌకర్యాలను తరచూ తనిఖీలు చేస్తామని తెలిపారు. ఆన్-కాల్ పశువైద్యుల కోసం వెటర్నరీ సేవలను ప్రాక్టీస్ చేయడానికి చెల్లుబాటు అయ్యే లైసెన్స్ పొందాలని సూచించారు. అజ్మాన్ మునిసిపాలిటీ నిబంధనలను పాటించడంలో విఫలమైతే కఠినమైన జరిమానాలు తప్పవని హెచ్చరించారు.Dh10,000 నుండి Dh500,000 వరకు జరిమానాలు విధిస్తామని తెలిపారు. దాంతోపాటు నాన్-కంప్లైంట్ వెటర్నరీ ఉత్పత్తుల జప్తు చేయడంతోపాటు ఉల్లంఘనలు పునరావృతమైతే కార్యకలాపాల సస్పెన్షన్ లేదా సౌకర్యాల మూసివేత ఉంటుందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!