షార్జాలో బైక్ ప్రమాదం..గాయపడిన మహిళ ఎయిర్ లిఫ్ట్..!!
- February 15, 2025
యూఏఈ: మోటార్ సైకిల్ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన 51 ఏళ్ల మహిళను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ సపోర్ట్‌లోని ఎయిర్ వింగ్ డిపార్ట్మెంట్కు చెందిన ఎయిర్ అంబులెన్స్ సిబ్బంది అత్యవసర తరలింపు ప్రక్రియను నిర్వహించారు. షార్జాలోని అల్ బదయేర్ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. షార్జా పోలీస్ జనరల్ కమాండ్ నుండి ప్రమాదం గురించి ఎయిర్ వింగ్ ఆపరేషన్స్ రూమ్‌కు సమాచారం అందిన తర్వాత తరలింపు ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. అవసరమైన వైద్య చికిత్స కోసం ఆ మహిళను వెంటనే హెలికాప్టర్ ద్వారా అల్ ధైద్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







