అబుదాబికి చేరుకున్న వివిధ దేశాల యుద్ధనౌకలు..!!
- February 16, 2025
అబుదాబికి చేరుకున్న వివిధ దేశాల యుద్ధనౌకలు..!!
యూఏఈ:2025లో జరిగే సముద్ర రక్షణ, భద్రతా ప్రదర్శన "NAVDEX" ఎనిమిదవ ఎడిషన్ ప్రారంభానికి ముందు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధనౌకలు అబుదాబిలోని ADNEC మెరీనా - వాటర్ఫ్రంట్కు చేరుకున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఒమన్, పాకిస్తాన్, గ్రీస్, దక్షిణ కొరియా , ఇండియాతోసహా ఎనిమిది దేశాల నుండి నావికా దళాల అసాధారణ విన్యాసాలు చేయనున్నాయి.ఆఫ్షోర్ పెట్రోల్ వెసెల్ అయిన ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ షూర్, NAVDEX & IDEXలో పాల్గొనడానికి అబుదాబిలో ఓడరేవుకు చేరుకుంది.
ఈ ప్రదర్శన ఫిబ్రవరి 17 నుండి 21 వరకు అంతర్జాతీయ రక్షణ ప్రదర్శన "IDEX"తో కలిసి జరుగుతుంది. దీనిని రక్షణ మంత్రిత్వ శాఖ, తవాజున్ కౌన్సిల్ సహకారంతో ADNEC గ్రూప్ నిర్వహిస్తోందని NAVDEX 2025 మారిటైమ్ కమిటీ ఛైర్మన్ బ్రిగేడియర్ జనరల్ రషీద్ ఇబ్రహీం రషీద్ అల్ ముహైస్ని తెలిపారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







