మాదకద్రవ్యాల వ్యతిరేక జాబితా అప్డేట్..ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- February 16, 2025
కువైట్: కువైట్ ఆరోగ్య మంత్రి డాక్టర్ అహ్మద్ అల్-అవధి మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలకు వ్యతిరేకంగా షెడ్యూల్‌లను అప్డేట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఫార్మసీ మార్కెట్లను నియంత్రించడం, అటువంటి మెడిసిన్ దుర్వినియోగం చేయకుండా సమాజాన్ని రక్షించడం ఈ చర్యల లక్ష్యం అని మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను తీసుకోవడంపై సెన్సార్‌షిప్‌ను పెంచే లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నాలకు ఈ డిక్రీలు అనుకూలంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
1983 నాటి లా నంబర్ 74లోని షెడ్యూల్ నంబర్ 1కి "ప్రోమెథాజైన్"ను యాడ్ చేశారు. 2025 నాటి నిర్ణయం నెం. 30లో "క్లోరోమెత్‌కాథినోన్, ఫ్లోరోడిస్క్లోరోకెటమైన్" వంటి కొన్ని అంశాలు మరియు వాటి ఉత్పన్నాలు చట్టం నెం. 45/1987లోని షెడ్యూల్ నెం. 2కి చేర్చారు. అత్యంత భద్రత , ప్రజారోగ్య ప్రమాణాలను సాధించేలా మాదకద్రవ్యాల నియంత్రణ చట్టాలు, నిబంధనలను అప్డేట్ చేసేందుకు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







