దిరియా ప్రధాన మౌలిక సదుపాయాలు 2027 నాటికి పూర్తి..!!
- February 16, 2025
రియాద్: ముఖ్యమైన దిరియా ప్రధాన మౌలిక సదుపాయాలు 2027 నాటికి పూర్తవుతాయని దిరియా గేట్ డెవలప్మెంట్ అథారిటీ గ్రూప్ CEO జెర్రీ ఇంజెరిల్లో అన్నారు. "ప్రధాన మౌలిక సదుపాయాలలో 60,000 భూగర్భ పార్కింగ్ స్థలాలు, వాకర్స్ అనుకూలమైన పాత్ వేస్, నగరం చారిత్రక వారసత్వంతో అనుసంధానించే అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి." అని రియాద్‌లోని PIF ప్రైవేట్ సెక్టార్ ఫోరమ్‌లో మాట్లాడుతూ తెలిపారు. "ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాణిజ్య, సాంస్కృతిక డిస్ట్రిక్ట్ లో పూర్తి సామర్థ్యంతో పనిచేసే 83 టవర్ క్రేన్లు ఉన్నాయి. పూర్తయిన తర్వాత, ఇది 1.9 కిలోమీటర్ల బౌలేవార్డ్, సౌదీ అరేబియా సమకాలీన ఆర్ట్ మ్యూజియం, 20,000 సీట్ల అరేనా, ఎగ్జిబిషన్ సెంటర్, ఒపెరా హౌస్ లలో ఉండే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆపిల్ స్టోర్‌ను కలిగి ఉంటుంది." అని తెలిపారు. "సౌదీ అరేబియా రాజ్యం జన్మస్థలమైన దిరియా, అపూర్వమైన $64 బిలియన్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఇది ప్రపంచ గమ్యస్థానంగా మారనుంది. ప్రస్తుతం 40,000 మంది కార్మికులు ప్రతిరోజూ ఆన్-సైట్లో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. దిరియాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇప్పటికే మూడు మిలియన్ల సందర్శకులను స్వాగతించిందని, 2030 నాటికి 27 మిలియన్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. దిరియా అనేది ఒక ప్రధాన విజన్ 2030 ప్రాజెక్ట్, దీని వేగవంతమైన పురోగతి సౌదీ అరేబియా భవిష్యత్ విస్తృత ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తున్నారు. సౌదీ అరేబియా ఇతర దేశాల కంటే వేగంగా G20 హోదాను సాధించిందని ఇంజెరిల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్‌లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్‌లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!







