మక్కా తొక్కిసలాటలో 18 మందికి గాయాలు
- July 02, 2016
ముస్లింల పవిత్ర స్థలమైన సౌదీ అరేబియాలోని మక్కాలో తొక్కిసలాట జరిగింది. దాదాపు 18 మంది గాయపడినట్లు సౌదీ అరేబియా మీడియా వెల్లడించింది. రంజాన్ మాసంలోని ఆఖరి శుక్రవారం సందర్భంగా నిన్న రాత్రి ప్రార్థనల కోసం మక్కా మసీదుకు పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరుకావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు ఏఐ-రియాద్ న్యూస్‌ఏజెన్సీ తెలిపింది. గాయపడిన వారందరికీ వెంటనే ప్రాథమిక చికిత్స అందించారని.. ఆస్పత్రిలో చేర్పించాల్సిన అవసరం రాలేదని పేర్కొంది. మక్కాకు ప్రతి రోజూ వేలాది మంది వెళ్తుంటారు. రంజాన్ మాసం సందర్భంగా యాత్రికులు మరింత ఎక్కువయ్యారు. .
ఈ ఏడాది సెప్టెంబరులో జరగనున్న హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది హజ్ యాత్ర పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. యాత్రికుల మధ్య తొక్కిసలాట జరిగి 2,297 మంది మృతిచెందారు. అయితే సౌదీ అరేబియా మాత్రం 769 మంది చనిపోయినట్లు ప్రకటించింది. గత ఏడాది దుర్ఘటన దృష్ట్యా భద్రత మరింత పెంచాలని సౌదీ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరగింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







