దుబాయ్ లో భర్తని కత్తితో పొడిచి...ఆపై ఆత్మహత్య చేసుకొన్న ఆసియా మహిళ
- July 02, 2016
దుబాయ్ లో తన భర్తని కత్తితో పొడిచి...ఒక ఆసియా మహిళ తన నివాస భవనం యొక్క 16 వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.ఆల్ బార్ష పోలీసు స్టేషన్ డైరెక్టర్ కల్నల్ యూసుఫ్ అల్ వడిఁది తెలిపిన వివరాల ప్రకారం ప్రాధమిక పరిశోధనలతో ఆ మహిళ గురువారం తన భర్తతో గొడవపడి ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు.
అల్ మారిన ప్రాంతంలో ఒక భవనం నుంచి ఒక మహిళ దూకి ఆత్మహత్య చేసుకోనుందని పోలీసులకు ఒక సమాచారం అందినట్లు తెలిపారు. అధికారికంగా మరణం గురించి సమాచారం అందుకున్న చెప్పారు. అంబులెన్స్ మరియు గస్తీ వాహనంతో ఆ ప్రాంతానికి ఒక పోలీసు బృందం వెళ్ళి మరణించిన మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. చనిపోయిన ఆ మహిళా తన భర్తతో భవనం యొక్క 16 వ అంతస్తులో తన భర్తతో నివసిస్తుఉండేదని . ఆమె భర్తతో వాగ్వివాదానికి దిగింది. ఈ వాదనలో ఆమె తన భర్తని అనేక సార్లు కత్తితో అనేక పోట్లు పొడిచినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. భర్తని చంపిన తర్వాత 16 వ అంతస్తు నుంచి దూకడంతో అక్కడికక్కడే ఆ మహిళ మరణించింది.
కుక్కతో రోడ్డు దాటుతూ...గాయపడిన యూరోపియన్ మహిళ.....
మరొక ప్రమాదంలో, దుబాయ్ లోని టీకా రోడ్డు దాటే సమయంలో ఒక మోటార్ సైకిల్ ఒక యూరోపియన్ మహిళ ని డీ కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. కల్నల్ అల్ లోబడి తెలిపిన వివరాల ప్రకారం యూరోపియన్ మహిళ కుక్కతో వాకింగ్ కు వెళ్ళే సమయంలో అయితే యూరోపియన్ మహిళ రోడ్డు దాటకూడని స్థలంలో దాటే యత్నంలో ఒక ఆసియా వ్యక్తి మోటారుసైకిల్ పై వచ్చి ఆమెను బలంగా తాకాడు. గాయపడిన ఆమెని సమీపంలో ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







