హృదయ మది
- February 17, 2025
ఇసుమంత స్వార్ధంలేని స్వఛ్ఛమైనది ఇచ్చి పుచ్చుకోవడంలో అందంగా దాగినది
ఇరు మనసుల ఉఛ్వాస నిశ్వాస స్పందనది
ఇంకిపోదు ఎంతదూరమైన పరిగెత్తమనేది
ఇది అని తెలుపలేక అనుక్షణం తల్లడిల్లుతుంది
ఇధ్ధరిలో రహస్యాలకి తావేలేదనేది....
ఎటుచూసినా నీవే నేను నేనే నీవంటుంది
ఎటుచూస్తే అటు నీరూపమే నంటుంది
ఏవేవో తీయనైన ఊహాలతో తడిమేది
ఎంతో ఆనందంతో మనసుని మైమరిపించేది
ఏవేవో కలలని కనుపాపలో నిలిపే ఆరాధనది
ఎదను పదే పదే మీటే అనురాగ సరాగమది....
నిన్ను నన్ను కలిపిన మది ఆరాటమది
నిన్ను వదలి వెళ్ళలేననే నీదేననే మనసది
నిన్ను పరిచయం చేసిన సరికొత్త పరిచయమది
నిన్ను తలచుకునేలా చేసేటి తలపుల పరవశమది
నిన్ను కలిసే ప్రతిక్షణం వేచిచూస్తాననే నీ ప్రాణమది..
మనసు పొరల్లో అనునిత్యం స్పృజించేది
మనసున నీ కోసమే పరితపించే సంఘర్షణది
మనసు చాటున దాగి ఉండే జన్మబంధమది
మనసులు కలిసాక నీకై అర్పించిన హృదయమిది..
--యామిని కోళ్ళూరు(అబుధాబి)
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!







