బంగ్లాదేశ్ లో ఉగ్రదాడి, 20 మంది మృతి
- July 02, 2016
బంగ్లాదేశ్‌లో ఐసిస్ ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఉగ్రదాడిలో 20 మంది మృతి చెందారు. మృతుల్లో ఒకరు భారతీయ మహిళ ఉన్నారు. మరో 13 మంది బందీలను సురక్షితంగా విడిపించారు. 10 గంటలపాటు జరిగిన ఆపరేషన్‌లో ఆరుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. ఓ ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు. ముష్కరుల దాడిని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. ఢాకా రెస్టారెంట్‌లో ముగిసిన సైనిక ఆపరేషన్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బందీలను విడిపించేందుకు 10 గంటల పాటు సాగిన సైనిక ఆపరేషన్ ముగిసింది. ఉగ్రదాడిలో 20 మంది మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. మృతుల్లో ఎక్కువ శాతం జపాన్, ఇటలీకి చెందినవారున్నారు. విదేశీయులతో పాటు మొత్తం 13 మంది బందీలను భద్రతా బలగాలు సురక్షితంగా విడిపించ గలిగాయి. ఆరుగురు ఉగ్రవాదులు హతం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. కాగా.. ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించే క్రమంలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. ముష్కరులు తమ ఆధీనంలో ఉన్న బందీలపై కాల్పులు జరపకుండా పదునైన ఆయుధంతో చంపినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువమంది విదేశీయులున్నట్లు బ్రిగేడియర్ జనరల్ చౌదరి తెలిపారు.దాడికి పాల్పడింది తామేనంటూ ఐసిప్ ప్రకటన ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. పవిత్ర రంజాన్ మాసంలో ఉగ్రవాదులు మానవ హననానికి పాల్పడడాన్ని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులకు హింస తప్ప మతంపై విశ్వాసం లేదన్నారు.రెస్టారెంట్ లోకి ఉగ్రవాదులు చొరబడి కాల్పులు కట్టుదిట్టమైన భద్రత ఉండే గుల్షన్ ప్రాంతంలోని హోలీ ఆర్టిసాన్ రెస్టారెంట్‌లోకి శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నరకు ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు. రెస్టారెంట్ సిబ్బందితో పాటు పలువురు విదేశీ పర్యాటకులతో పాటు మొత్తం 20 మందిని బందీలుగా చేసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు రెస్టారెంట్‌ను చుట్టుముట్టి ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించాయి. భద్రతా బలగాలు, సాయుధ ఉగ్రవాదులకు మధ్య 11 గంటలపాటు భీకర పోరు జరిగింది. హోలీ ఆర్టిసాన్ రెస్టారెంట్‌కు ఎక్కువ మంది విదేశీయులే రావడంతో ఉగ్రవాదులు దీన్ని టార్గెట్ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







