ఎత్తైన దుబాయ్ మెరీనా నివాస భవనంలో అగ్నిప్రమాదం..!!
- February 18, 2025
యూఏఈ: దుబాయ్ మెరీనాలోని రెసిడెన్షియల్ టవర్‌లో సోమవారం చెలరేగిన మంటలు అదుపులోకి వచ్చినట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. భవనం పైకప్పుపై ఉన్న ఎయిర్ కండిషనింగ్ కూలర్‌లలో మంటలు చెలరేగాయని అధికార యంత్రాంగం పేర్కొంది. ఎత్తైన టవర్ పై నుండి పొగలు వస్తున్నట్లు సోషల్ మీడియాలోని షేర్ అవుతున్నాయి.
మెరీనాలో నివసించే దుబాయ్ నివాసి MA, సంఘటన జరిగిన సమయంలో మధ్యాహ్నం సమయంలో పోలీసు సైరన్‌ల శబ్దం వినిపించిందని చెప్పారు. ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన ఒక వీడియో మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉన్న టవర్ నుండి దట్టమైన పొగలు వస్తున్నట్లు కనిపించింది.
మధ్యాహ్నం 12:20 గంటలకు ఘటన జరిగిన ఐదు నిమిషాల తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది వెంటనే తరలింపు, అగ్నిమాపక కార్యకలాపాలను ప్రారంభించారు. వారు మధ్యాహ్నం 12:44 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







