విడుదలైన 'నిర్మల కాన్వెంట్' ట్రైలర్
- July 02, 2016
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'నిర్మల కాన్వెంట్'. నాగార్జున అతిథి పాత్రలో కనిపించనున్న ఈ చిత్ర డిజిటల్ ట్రైలర్‌ను శనివారం నాగార్జున సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఇది స్వచ్ఛమైన ప్రేమ కథని, తనకు ప్రేమ కథలంటే ఇష్టమని నాగ్ తెలిపారు. ఈ ట్రైలర్ నాగ్ మార్క్‌తో అందంగా ఉంది. నాగార్జున వాయిస్ ఓవర్ ఇస్తూ ఈ సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేశారు. హీరోగా నటిస్తున్న రోషన్ పేరు శామ్యుల్ అని.. హీరోయిన్ శ్రేయాశర్మ పేరు శాంతి అని వీరు లవ్‌లో పడినట్టు చెబుతారు. కానీ శామ్యుల్ తననే ఛాలెంజ్ చేశాడని, చూద్దాం..గెలుపెవ్వరిదో అని నాగ్ ట్రైలర్‌లో చెప్పారు. రోషన్ నటన ఆకట్టుకునేలా ఉంది. నాగార్జున సమర్పణలో మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా జి. నాగకోటేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్నారు. శ్రేయాశర్మ నాయిక. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని చిత్రయూనిట్ తెలిపారు. అనితా చౌదరి, సమీర్, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి సంగీతమందిస్తుండగా, స్వర మాంత్రికుడు ఏ ఆర్ రెహమాన్ తనయుడు అమీన్ ఇందులో ఓ పాట పాడడం విశేషం.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







