ఒమన్‌లో రక్త దాతలు అత్యవసరం.. డిబిబిఎస్
- February 18, 2025
మస్కట్: బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్స్ సర్వీసెస్ విభాగం (డిబిబిఎస్) ప్రజలను కోరింది. ఇటీవలి దాతల సంఖ్య తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇది రక్త సరఫరాలో తగ్గుదలకు దారితీసిందన్నారు. "ఈ క్లిష్టమైన కాలంలో బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేయడాన్ని పరిగణించాలని మేము ప్రతి ఒక్కరినీ గట్టిగా కోరుతున్నాము" అని ప్రకటనలో తెలిపింది.
బౌషర్‌లోని సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ శనివారం నుండి గురువారం వరకు ఉదయం 8:00 నుండి రాత్రి 8:00 వరకు, శుక్రవారం ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు తెరిచి ఉంటుంది. విచారణల కోసం లేదా రక్తదానం చేయడానికి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి DBBSని వాట్సాప్ ద్వారా 94555648లో సంప్రదించాలని సూచించారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







