అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా పటేల్
- February 21, 2025
అమెరికా: అమెరికా ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా భారతీయ సంతతికి చెందిన కాష్ పటేల్ నియమితులయ్యారు.ఆయన నియామకానికి సంబంధించిన తీర్మానానికి సెనెట్ ఆమోదం తెలిపింది.రెండు ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ పేరును ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్.ఇలాంటి పదవులకు సంబంధించిన నియామకాలను సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది.తాజాగా ఈ తీర్మానంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించారు. 51-49 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.
డెమోక్రటిక్ సెనెటర్లందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఓటు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అత్యంత కీలకమైన ఎఫ్‌బీఐ చీఫ్‌గా కాష్ పటేల్ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నామనే విషయాన్ని వాళ్లు చెప్పకనే చెప్పినట్టయింది. డెమోక్రటిక్ సెనెటర్ల ఏ ఒక్క ఓటు కూడా తీర్మానానికి అనుకూలంగా పడలేదు. సెనెట్ ఆమోదంతో కాష్ పటేల్‌కు లైన్ క్లియర్ అయింది.
కాష్ పటేల్..పూర్తి పేరు కశ్యప్ ప్రమోద్ వినోద్ పటేల్. ప్రవాస భారతీయుడు. స్వరాష్ట్రం గుజరాత్. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో జన్మించారు. ఆయన తండ్రి అమెరికాలోని ఓ ఏవియేషన్ సంస్థలో ఫైనాన్షియల్ ఆఫీసర్.లాంగ్ ఐలండ్‌లోని గార్డెన్ సిటీ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు కాష్ పటేల్. 2002లో యూనివర్శిటీ ఆఫ్ రిచ్‌మండ్‌లో క్రిమినల్ జస్టిస్‌లో డిగ్రీ చదివారు.
వైట్ హౌస్ అధికారికంగా ప్రకటన
కాష్ పటేల్ నియామకాన్ని వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకాన్ని ముందడుగుగా అభివర్ణించింది.దేశ సమగ్రతను పునరుద్ధరించడానికి, చట్ట-న్యాయ వ్యవస్థను గాడిన పెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న అజెండాను అమలు చేయడంలో కీలకమైన అడుగు పడిందని పేర్కొంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







