దుబాయ్ లూప్..ట్రాఫిక్ సమస్యకు చెక్..తగ్గనున్న ప్రయాణ సమయం..!!

- February 21, 2025 , by Maagulf
దుబాయ్ లూప్..ట్రాఫిక్ సమస్యకు చెక్..తగ్గనున్న ప్రయాణ సమయం..!!

దుబాయ్: రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా నిమిషాల వ్యవధిలో మీ ఇంటి నుండి కార్యాలయానికి ప్రయాణించడం సాధ్యమేనా? దుబాయ్‌లో రవాణా భవిష్యత్తుగా ఇటీవల ప్రకటించిన ‘దుబాయ్ లూప్’తో ఇది సాధ్యమే. ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ గంటకు 20వేల మంది ప్రయాణికులను రవాణా చేయడానికి రూపొందించిన 11 స్టేషన్లను కలిగి ఉన్న 17 కిమీ సొరంగంను(లూప్) పైలట్ చేస్తుంది. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకారం.. నగరవ్యాప్తంగా భూగర్భ రవాణా వ్యవస్థను నిర్మించడం దీర్ఘకాలిక ప్రణాళికగా ఉంది. దుబాయ్ లూప్ అమెరికన్ బిలియనీర్ ఎలోన్ మస్క్ యాజమాన్యంలో ఉన్న ది బోరింగ్ కంపెనీ (TBC) భాగస్వామ్యంతో దీనిని నిర్మించనున్నారు.

వ్యవస్థ ఎంత వేగంగా ఉంది?

TBC ప్రకారం, ఈ సిస్టమ్ గరిష్టంగా 160kmph వేగాన్ని కలిగి ఉంటుంది. దుబాయ్‌లోని కీలక పాయింట్ల మధ్య కేవలం నిమిషాలలో చేరుకోవచ్చు. ఆ మేరకు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది.

సామర్థ్యం పెంచుతారా?

17 కిలోమీటర్ల సొరంగం ప్రతిపాదిత ప్రాజెక్ట్ ప్రారంభ దశగా పనిచేస్తుంది. అనంతరం వ్యవస్థ గంటకు 100,000 మంది ప్రయాణీకులను నిర్వహించేలా విస్తరించడం లక్ష్యాన్ని పెట్టుకుంది. పట్టణ రవాణా డిమాండ్లకు అధిక సామర్థ్య పరిష్కారాన్ని అందిస్తుందని TBC తెలిపింది.

దుబాయ్ లూప్ ఎలా పని చేస్తుంది?

టన్నెల్స్‌లో టెస్లాస్ అని కూడా పిలువబడే లూప్ సిస్టమ్, మధ్యమధ్యలో ఎటువంటి స్టాప్‌లు లేకుండా ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేరవేసే ఎలక్ట్రిక్ హై-స్పీడ్ సిస్టమ్. ఇది సబ్‌వే కంటే భూగర్భ రహదారిని పోలి ఉంటుందని, చాలా వేగంగా ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. సిస్టమ్ ప్రకటన సమయంలో మస్క్ దానిని "వార్మ్‌హోల్"తో పోల్చాడు.  

సిస్టమ్ ట్రాఫిక్ కష్టాలను ఎలా పరిష్కరిస్తుంది?

లూప్ వ్యవస్థ ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. చిన్న స్టేషన్‌లు, లూప్ సిస్టమ్‌లో ఎన్ని స్టేషన్‌లను నిర్మించవచ్చనే దానిపై గరిష్ట పరిమితి లేకుండా, రద్దీగా ఉండే నగర కేంద్రాలు, నివాస ఏరియాలలో విస్తరిచంనున్నారు. భవిష్యత్ లో మరింత సౌకర్యవంతమైన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను నిర్మించడం ద్వారా రద్దీని తగ్గిస్తుంది. జనావాస ప్రాంతాలలో రద్దీని తగ్గిస్తుంది. అవసరమైతే, సామర్థ్యాన్ని పెంచడానికి పెద్ద స్టేషన్లను నిర్మించవచ్చు.

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా లూప్ ఉందా?

TBC ప్రకారం.. లూప్ వ్యవస్థ ఇప్పటికే 2021 నుండి లాస్ వేగాస్ అంతటా రెండు మిలియన్ల మంది ప్రయాణీకులను రవాణా చేసింది. వెగాస్ లూప్ ప్రస్తుతం యాక్టివ్ డెవలప్‌మెంట్‌లో ఉంది.  104 స్టేషన్లు, 110 కి.మీ టన్నెల్స్ ఉన్నాయి.  సిస్టమ్ అంతటా గంటకు 90వేల మంది ప్రయాణికులను రవాణా చేస్తుంది.

ఇది సురక్షితమేనా?

నిర్మాణ కంపెనీ ప్రకారం.. లూప్ సొరంగాలు అత్యవసర నిష్క్రమణలు, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్‌లు, ఫైర్ సప్రెషన్ సిస్టమ్‌లు, ఫైర్-రేటెడ్ ఫస్ట్ రెస్పాండర్ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్‌తో కనెక్ట్ అయి ఉంటాయి. లూప్ టన్నెల్‌లు కూడా పూర్తిగా ప్రకాశవంతంగా, ఏదైనా సంఘటన జరిగితే, లూప్ బ్లైండ్ స్పాట్‌లు లేకుండా పూర్తి కెమెరా కవరేజీని కలిగి ఉంటుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com