హైదరాబాద్ లో ఘనంగా 'పాటకు పట్టాభిషేకం' కార్యక్రమం
- February 21, 2025
హైదరాబాద్: విఖ్యాత గాయకులు ఘంటసాల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పాటలు తెలుగు భాష కు వన్నె తెచ్చాయి అని వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు అన్నారు.వారి పాటలో మాధుర్యం మాత్రమే కాక తెలుగు భాష ఉచ్చారణ భాష లోని అందం శ్రోతలకు అందించిందని అయన పేర్కొన్నారు.అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ సందర్భంలో వీరి పాటలు ఎంపిక చేసుకోవటం సముచితంగా ఉందన్నారు.శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదిక పై వంశీ ఇంటర్నేషనల్ (ఇండియా) నిర్వహణలో ప్రముఖ గాయకుడు దాసరి శ్రీహరి సారథ్యంలో పాటకు పట్టాభిషేకం పేరిట ఘంటసాల బాలసుబ్రహ్మణ్యం సినీ గీతాలను వై.ఎస్ రామకృష్ణ ఇందునయన సురేఖ మధురంగా ఆలపించారు.శ్రీ హరి సహా గాయకులతో కలసి ఆలపించి వాడిన పూలే వికసించేనే పాటను సుమధుర స్వరంతో పాడారు అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వంశీ రామరాజు పాల్గొని గాయకులను సత్కరించి మాట్లాడారు నేటి వారికి ఘంటసాల పాటలు వినిపిస్తే తెలుగు భాష పై మక్కువ పెరుగుతుందని చెప్పేరు ఉత్తమ కార్యక్రమాలు చేసే వారికి వంశీ సంస్థల సహకారం అందిస్తామని తెలిపారు.సుధామయి వ్యాఖ్యానం చేసిన కార్యక్రమంలో సుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొనగా లలిత కార్యక్రమ నిర్వహణ చేశారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







