దుబాయ్: ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ పిచ్ రిపోర్టు
- February 22, 2025
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జరిగే ఐదో మ్యాచ్ లో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.ఈ మ్యాచ్ యూఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. ఫిబ్రవరి 23, ఆదివారం జరిగే ఈ మ్యాచ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 2 గంటలకు వేస్తారు. ఈ మ్యాచ్ పాకిస్తాన్ కు డూ ఆర్ డై లాంటింది. ఓడితే పాక్ టోర్నీ నుంచి ఔట్ అవుతుంది. ఇక భారత్ గెలిస్తే సెమీస్ కు చేరుకుంటుంది. మ్యాచ్ జరిగే దుబాయ్ క్రికెట్ స్టేడియం పిచ్ రిపోర్టు, ఇక్కడ భారత్, పాకిస్తాన్ రికార్డుల వివరాలు గమనిస్తే..
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలోని పిచ్ సాధారణంగా స్లో ట్రాక్‌లో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. ఈ పిచ్‌పై కొత్త బంతి ఫాస్ట్ బౌలర్లకు సహాయపడుతుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్ల పనిభారం కూడా పెరుగుతుంది. అంటే మొత్తంగా దుబాయ్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లు ఆరంభంలోనే వికెట్లు తీసుకుంటే వారిపై భారం తగ్గుతుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







