మహాశివరాత్రి
- February 26, 2025
మహా శివరాత్రి.. దేశంలోనే అతిపెద్ద పండుగ. శివరాత్రి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా శివనామ స్మరణతో గడుపుతారు. మొత్తం నాలుగు దశల్లో శివ పూజ చేస్తారు. ఇంట్లోనే శివలింగం ప్రతిష్టించి అభిషేకం చేసుకొని పూజ జరిపించుకోవచ్చు. లేదంటే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోవచ్చు. రుద్రాభిషేకంలోనూ పాల్గొనవచ్చు. అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు? విశిష్టత ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..
ఈ చరాచర సృష్టికి లయకారకుడు మహేశ్వరుడు. పరమేశ్వరుడు లింగోద్భవం చెందిన రోజునే మహాశివరాత్రి. ఈ జగత్తును నడిపించే శివుడు మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజున శివలింగంగా ఆవిర్భవించిన రోజు కావడంతో మహాశివరాత్రి జరుపుకుంటారు. శివ అనే పదానికి శుభపద్రం, మంగళకరం అన్న అర్థాలు ఉన్నాయి. శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండడంతో పాటు జాగరణ చేయాల్సిందే.
మహాశివరాత్రి, లింగోద్భవానికి సంబంధించిన ఓ పురాణ కథ ఉన్నది. లింగ పురాణం, శివ పురాణం, స్కంద పురాణం, కూర్మ పురాణం, వామన పురాణం, బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం వంటి అనేక పురాణాల్లో లింగోద్భవం గురించి ప్రస్తావన ఉంటుంది. పూర్వం విష్ణువు, బ్రహ్మల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. ఈ వివాదం ఎప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ సమయలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై.. లింగంగా జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడు.
ఆ మహా శివలింగానికి ఆది, అంతాలను కనిపెట్టిన వారే గొప్పవారని బ్రహ్మ, విష్ణువులకు చెబుతారు. ఇద్దరూ ఈ శివలింగం ఆది, అంతాలను గుర్తించలేకపోతారు. ఆ తర్వాత ఇద్దరికీ కనువిప్పు కలుగుతుంది. పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన ఈ రోజునే శివరాత్రిగా పండితులు చెబుతారు.
అయితే, ప్రళయ కాళరాత్రి అనంతరం.. జగన్మాత కోరిక మేరకు పరమేశ్వరుడు మళ్లీ జీవకోటిని ఉద్భవింపజేసినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం సంప్రదాయంగా వస్తున్నది. శివరాత్రికి ముందు రోజు ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి.
శివరాత్రి రోజున ఉదయం స్నానం పూర్తి చేసుకొని ఆలయానికి వెళ్లి ఆ మహేశ్వరుడి దర్శనం చేసుకొవాలి. నిత్యం శివనామస్మరణ చేస్తూ ఉపవాసం చేయాలి. రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ.. జాగరణ చేయాలి. ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటే శివానుగ్రహం తప్పక లభిస్తుంది. వాస్తవానికి.. అందరు దేవతామూర్తులను వారి రూపంలో ఉండే విగ్రహాలను కొలుస్తాం.
అయితే, కేవలం శివుడిని మాత్రమే లింగంగా పూజిస్తాం. నిండు మనసు, భక్తితో కొలిస్తే ఆ భోళాశంకరుడు ప్రత్యక్షమై వరాలను కురిపిస్తాడు. క్షీరసాగర మధనతో బయటకు వచ్చి.. యావత్ సృష్టిని దహించేందుకు సిద్ధమైన హాలాహలాన్ని కంఠంలోనే దాచుకొని నీలకంఠుడిగా నిలిచాడు. తన శరీరంలోనే పార్వతీదేవికి అర్ధభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. యముడి బాధ నుంచి రక్షించాలని కోరిన భక్త మార్కండేయుడిని చిరంజీవిగా దీవించాడు ఆ మహేశ్వరుడు.
లింగోద్భవ సమయంలో మారేడు దళాలతో అర్చిస్తే 76 జన్మల్లో చేసిన పాపలు నశిస్తాయని సాక్షాత్తు ఆ శంకరుడే పార్వతీదేవికి చెప్పినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడిని జలంతో అభిషేకించడం, భస్మం సమర్పించడం కూడా శుభకరమని పండితులు పేర్కొంటున్నారు.
పురాణాల ప్రకారం ఓ రోజు ఈశ్వరుని భార్య పార్వతీదేవి శివరాత్రి గురించి శివుడిని అడగగా.. తనకు శివరాత్రి ఉత్సవాలంటే ఎంతో ఇష్టమనీ.. ఆ ఒక్క రోజు తనకు ఉపవాసంతో ఉండి, జాగరణ(నిద్రపోకుండా) ఉంటే చాలని చెబుతాడు. అదే విధంగా ఈరోజున పగలంతా ఎంతో నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి, రాత్రి సమయంలో శివలింగాన్ని పాలతో, పెరుగుతో, నెయ్యితో, తేనేతో అభిషేకం చేస్తే వారికి తన అనుగ్రహం తప్పక లభిస్తుందని చెబుతాడు.
శివరాత్రి రోజున చాలామంది భక్తులకు ఉపవాసం ఏ విధంగా చేయాలో చాలామంది భక్తులకు సందేహంగా ఉన్నది. ఉపవాసం అంటే ఉడకబెట్టినటువంటి ఆహారాలు కాకుండా సాత్వికమైన ఆహారం తీసుకుంటూ దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని నామస్మరాలు చదువుతూ, శివునికి జలాభిషేకం చేస్తే వారు కోరిన కోరికలు తీరుతాయని పురోహితులు తెలియజేశారు.
మహాశివరాత్రి రోజున ఉపవాస ఉండడం అంటే దేవుని సన్నిధిలో ఉండడం అర్థం, ఉపవాసం రోజున నేను లాలాజలం మింగలేను, నీళ్లు తాగలేను, కొంతమంది భక్తులు వాదిస్తుంటారు. కానీ శివరాత్రి రోజున సూర్య ఉదయం నుండి మరనాడు సూర్యోదయం వరకు మర్నాడు 24 గంటలు ఉపవాస దీక్ష చేయాలి. ప్రస్తుత ఆధునిక కాలంలో భక్తులు ఉదయం నుండి మధ్యరాత్రి 12 గంటల వరకే దీక్ష చేస్తున్నారు.
ఆ విధంగా చేస్తే ఉదయం నుంచి చేసిన ఉపవాసం ఫలించడానికి అన్నారు. అదే విధంగా మితమైన ఆహారంతో ఉడకబెట్టిన ఆహారం కాకుండా పళ్ళు పాలు సాత్వికమైన ఆహారం తీసుకోవాలని తెలియజేశారు. ఉపవాసం రోజున కొంతమంది భక్తులు మితమైన ఆహారం కాకుండా, బజ్జీలు, పూరీలు తింటున్నారు అది ఉపవాసంలోకి తీసుకోకూడదని అన్నారు. మహాశివరాత్రి అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పండుగ, దీనిని శివునికి పూజ, భక్తి రూపంగా జరుపుకుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా ముఖ్యం.
విశ్వాసం, భక్తితో ఉపవాసం ఉండే వ్యక్తికి శివుని ఆశీస్సులు లభిస్తాయి. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండటం క్రోధ, విశ్వాసం, భక్తికి చిహ్నం. ఈ రోజున భోజనం చేసేటప్పుడు, ఏది తిన్నా అది శరీరాన్ని తేలికగా, ఆరోగ్యంగా ఉంచేలా జాగ్రత్త వహించాలి. తద్వారా పూర్తి విశ్వాసంతో ఉపవాసం యొక్క ఉద్దేశ్యం అని అన్నారు.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్