సూడాన్ లో కుప్పకూలిన విమానం…10 మంది మృతి
- February 26, 2025
సూడాన్: దక్షిణ సూడాన్‌లో మిలటరీ విమానం ఒకటి కుప్పకూలిపోయింది.ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖార్జూమ్ సమీపంలోని వాది సీద్నా ఎయిర్ బేస్ నుంచి మంగళవారం రాత్రి ఆర్మీ ఫ్లైట్ బయలుదేరేందుకు సిద్ధమైంది. ఈ విమానం రన్‌వేపై పరుగులు పెట్టి టేకాఫ్ అవుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది మృతి చెందారు. వారిలో ఆర్మీ అధికారులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో విమానంలో 20 మంది ఉన్నారు.. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. విమానాశ్రయంలోని అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసి, పలువురు ప్రయాణికులను కాపాడారు. ఖార్టూమ్ సమీపంలోని వాది సీద్నా ఆర్మీ ఎయిర్ బేస్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నుంచి గాయాలతో బయటపడ్డ ప్రయాణికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రాథమిక దర్యాఫ్తులో విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







