తల్లితండ్రుల నిర్లక్ష్యం తో కారులోనే మృతిచెందిన బాలుడు

- July 11, 2015 , by Maagulf
తల్లితండ్రుల నిర్లక్ష్యం తో కారులోనే మృతిచెందిన బాలుడు

షార్జా లోని అల్ రామ్సా లో, తల్లితండ్రుల నిర్లక్ష్యం వలన నాలుగు సంవత్సరాల బాలుడు, తన ఇంటిముందు పార్క్ చేసిన కారులోనే మృతిచెందాడు! ఇక్కడి పోలీసువారి కధనం ప్రకారం, కుమారుడితోపాటు ఇంటికి కారులో వచ్చిన తండ్రి, కొడుకు ఇంటిలోకే వెళ్ళాడని పొరబడి, కారు లాక్ చేసి తన విల్లాలోకే వెళ్లిపోవడంతో అధికవేడి, ఊపిరి ఆడకపోవడం వలన ఆపస్మారక స్థితికి చేరుకున్న బాలుణ్ణి అల్ క్వసైమీ ఆసుపత్రికి తీసుకువెళ్ళినపుడు, వైద్యులు అతడు మృతి చెందినట్టు ధృవీకరించారు. ఇలాంటి కేసులు ఒక్క షార్జా లోనే 5 కు పైగా నమోదయ్యాయని వారు తెలిపారు. ఈ కేసులో దుబాయి న్యాయ సంస్థ డైరక్టర్ జమాల్ అల్ సుమైతీ  తల్లితండ్రులను దోషులుగా గుర్తించారు; వారికి ఈ నుండి 3 నెలల జైలుశిక్ష పదే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com