బహ్రెయిన్ లో పేద సాదలకు అన్నదానం

- July 11, 2015 , by Maagulf
బహ్రెయిన్ లో పేద సాదలకు అన్నదానం

బహ్రెయిన్ లో రమదాన్ సందర్భంగా నేమహ్ సొసైటీ అనే మతప్రమేయం లేని స్వచ్చంద సంస్థకు చెందిన వాలెంటీర్లు ఇల్లు, రెస్టారెంట్లలో మిగిలిన ఎంగిలిచేయబడని ఆహారాన్ని సేకరిoచి, మరల ప్యాక్ చేసి వాటిని అవసరమైన వారికి అందజేస్తున్నారు. ఈ సొసైటీ ఉపాద్యక్షులు అహ్మద్ అల్ మహ్మూద్ మాట్లాడుతూ, గత సంవత్సరం రమదాన్ లో 3400 భోజనాలు అందించామని, ఈ సంవత్సరం రమదాన్ మధ్యలోనే ఈ సంఖ్యకు చేరగలగడం ఆనందంగా ఉందన్నారు.  గత ఫెబ్రవరిలో ఏర్పడిన ఈ సంస్థ ఇప్పటివరకు 10, 000 మందికి అన్నదనం చేసిందని, అందుకు తోడ్పడిన శ్రేయోభిలాషులకు, అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సంవత్సరమంతా కొనసాగిస్తామని కూడా తెలిపారు. వాలంటీర్లు కావాలనుకునేవారు - ఇన్స్టగ్రాం ఐ డి - @ne3mahsave కు, దానం చేయాలనుకునేవారు - ఫోన్ నంబర్లు - 39674786 లేదా 36660009 కు సంప్రదించవచ్ఛని తెలిపారు.

 

--యం.వాసుదేవ్ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com