దుబాయ్ లో వేరియబుల్ పార్కింగ్ ఫీజు ఏప్రిల్ నుండి ప్రారంభం..!!
- March 01, 2025
దుబాయ్: పార్కిన్ PJSC—ఎమిరేట్‌లో పెయిడ్ పబ్లిక్ పార్కింగ్ సౌకర్యాల అతిపెద్ద ఆపరేటర్. కొత్త వేరియబుల్ ప్రైసింగ్ టారిఫ్‌ను ఏప్రిల్ 2ప్రారంభం నుండి దుబాయ్ అంతటా ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపింది. పబ్లిక్ పార్కింగ్ నాలుగు టారిఫ్ జోన్లుగా వర్గీకరించారు. A,B, C, D ఆన్, ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్ కోసం ప్రీమియం, స్టాండర్డ్ జోన్లుగా వర్గీకరించారు. A నుండి D జోన్లలో ప్రామాణిక పార్కింగ్ స్థలాలకు గరిష్ట ధర రోజుకు 14 గంటలలో ఆరింటికి వర్తిస్తుందని పార్కిన్ చెప్పారు. రద్దీ సమయాల్లో (ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు) ప్రీమియం పార్కింగ్‌కు అన్ని పబ్లిక్ పార్కింగ్ జోన్లలో (A,B, C, D) గంటకు Dh6 ఛార్జీ విధించబడుతుంది(పబ్లిక్ సెలవులు మినహా). రద్దీ లేని సమయాల్లో (ఉదయం 10– సాయంత్రం 4 మరియు రాత్రి 8 – రాత్రి 10 వరకు) ఫీజులు మారవు. ప్రస్తుతం ఉన్న టారిఫ్ నిర్మాణానికి అనుగుణంగా ధర ఉంటుంది. జోన్లు B , D రోజువారీ రేటు ఎంపికను అందించడం కొనసాగిస్తుంది. ప్రీమియం పార్కింగ్‌కు రోజువారీ టారిఫ్ జోన్ Bలో 40 దిర్హామ్‌లు, జోన్ Dలో 30 దిర్హామ్‌లుగా ఉంటుంది.
దుబాయ్: వేరియబుల్ పార్కింగ్ ఫీజు ఏప్రిల్ నుండి ప్రారంభం కానుందని పార్కిన్ ప్రకటించింది
రమదాన్ సమయాలు
సోమవారం నుండి శనివారం వరకు రెండు పీరియడ్లు ఉన్నందున రమదాన్ లో ఛార్జిబుల్ గంటలు మారుతాయి. మొదటి పీరియడ్ 8am నుండి 6pm వరకు ఉంటుంది. రెండవ పీరియడ్ రాత్రి 8 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుంది. సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పార్కింగ్ ఉచితం. రమదాన్ సమయంలో మల్టీ-స్థాయి పార్కింగ్ భవనాలు 24/7 పనిచేస్తాయి.
ప్రీమియం పార్కింగ్ ప్రాంతాలు
ప్రస్తుతం ఏప్రిల్ 2025 నుండి ప్రవేశపెట్టబోతున్న వేరియబుల్ ప్రైసింగ్ టారిఫ్‌కు సంబంధించి అత్యుత్తమ అంశాలను నిర్ధారించడానికి మరియు ఖరారు చేయడానికి రోడ్లు, ట్రాస్పోర్ట్ అథారిటీ (RTA)తో చర్చలు జరుగుతున్నాయని పార్కిన్ ప్రకటించింది. ప్రీమియం పార్కింగ్ ప్రాంతాల్లో టారిఫ్‌ల పెంపునకు సంబంధించిన ప్రకటనను పార్కిన్ గత ఏడాది నవంబర్‌లో తొలిసారిగా ప్రకటించింది.
పార్కిన్ సీఈఓ మొహమ్మద్ అబ్దుల్లా అల్ అలీ మాట్లాడుతూ.. ప్రీమియం పార్కింగ్ స్థలాల కోసం స్థానాలు మూడు ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేశామని, మొదటిది, మెట్రో స్టేషన్‌కు 500 మీటర్ల లోపు ప్రాంతాలు వంటి ప్రజా రవాణాను ఉపయోగించి ప్రాంతానికి సులభంగా చేరుకోవడం, రెండవది, పీక్ పీరియడ్లలో ఎక్కువ పార్కింగ్ ఆక్యుపెన్సీ ఉన్న ప్రాంతాలు, మూడవది, మార్కెట్లు-వాణిజ్య కార్యకలాపాల జోన్ల వంటి సాంద్రత మరియు రద్దీ ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రీమియం పార్కింగ్ స్థలాలలో డీరా, బర్ దుబాయ్, డౌన్‌టౌన్ దుబాయ్, బిజినెస్ బే, జుమేరా, అల్ వాస్ల్ రోడ్ లతోపాటు ఇతర ప్రదేశాలలో వాణిజ్య ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. కంపెనీ పబ్లిక్ పార్కింగ్ పోర్ట్‌ఫోలియోలో సుమారు 35 శాతం 184,000 స్థలాలు ప్రీమియం పార్కింగ్‌గా అర్హత పొందుతాయన్నారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









