BD87,000 దుర్వినియోగం..ప్రభుత్వ స్కూల్ స్టాఫ్ కు జైలు శిక్ష..!!
- March 01, 2025
మనామా: పాఠశాల నిధుల నుండి దాదాపు BD87,000 దుర్వినియోగం చేసినందుకు.. అధికారిక రికార్డులలో మార్పులు చేసినందుకు ముగ్గురు ప్రభుత్వ పాఠశాల ఉద్యోగులకు జైలు శిక్ష విధించారు. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఒక్కొక్కరు తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని, దుర్వినియోగం చేసిన మొత్తాలకు సమానంగా జరిమానాలు చెల్లించాలని ఆదేశిస్తూ హై క్రిమినల్ కోర్ట్.. ఏడాది నుండి 10 సంవత్సరాల వరకు శిక్షలు విధించింది. తప్పుడు పత్రాలను కూడా కోర్టు స్వాధీనం చేసుకుంది.
విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రభుత్వ పాఠశాలలో అవకతవకలు జరిగినట్లు నివేదించిన తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. నిందితులు రికార్డులు మార్చినట్లు, నకిలీ ఇన్‌వాయిస్‌లు, తప్పుడు లింక్‌లతో లావాదేవీలు జరిపినట్లు దర్యాప్తు అధికారులు విచారణ సందర్భంగా గుర్తించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







