రూ.550 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సీఎం రేవంత్

- March 02, 2025 , by Maagulf
రూ.550 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సీఎం రేవంత్

తెలంగాణ: వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో రూ.550 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.

పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రం,మండలాల్లో రూ.40 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు, నూతన ప్రభుత్వ ఆసుపత్రి భావన నిర్మాణానికి రూ.203.95 కోట్లతో,నూతన ఐటీ టవర్ భవన నిర్మాణానికి 22 కోట్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణాలకు రూ. 47.50 కోట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లు, 30 పడకల ఆస్పత్రి భావనము (పెబ్బేర్) నిర్మాణపు పనులకు రూ. 11.20 కోట్లు, శ్రీరంగాపూర్ ఆలయానికి పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు 1.5 కోట్లు, వనపర్తి నియోజకవర్గంలో గిరిజన ఆవాసాల అభివృద్ధి పనులకు రూ. 22.67 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులకు ముఖ్య మంత్రి శంకుస్థాపనలు చేశారు. దీనితోపాటు కాసిం నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం సమగ్ర సర్వే పనులకు కూడా శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు మల్లు రవి, జిల్లా ఇన్చార్జి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,వనపర్తి శాసన సభ్యులు తుడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, వివిధ శాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు,జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com