సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..హెచ్చరిక జారీ..!!
- March 04, 2025
రియాద్: సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలలో శుక్రవారం వరకు వర్షం పడే అవకాశం ఉన్నందున, పౌర రక్షణ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. సౌదీ అరేబియాలోని చాలా ప్రాంతాలకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. మక్కా, రియాద్, మదీనా, తబుక్, హైల్, ఖాసిమ్, తూర్పు ప్రావిన్స్, ఉత్తర సరిహద్దులు, అల్-జౌఫ్, అల్-బహా, అసిర్ ప్రాంతాలలో శుక్రవారం వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. నివాసితులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, లోయలు వంటి ఆకస్మిక వరదలకు గురయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. వాటిలో ఈత కొట్టకుండా ఉండాలని కోరింది. అధికారిక ఛానెల్లు, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా తాజా వాతావరణ సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







