ఫేస్ బుక్ లో పోస్ట్ చేయకూడనివి...
- July 04, 2016సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్ లో ఏవి పడితే అవి పోస్ట్ చేయకూడదని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అవి పోస్ట్ చేసిన వాళ్లకు ఇబ్బందులు తీసుకొస్తాయంట. అలా పోస్ట్ చేయకూడని కొన్ని అంశాల గురించి వారు ప్రత్యేకంగా చెప్పారు. అవేమిటో ఒకసారి పరిశీలిస్తే..బ్యాంక్ వివరాలు.. డబ్బు పంపించేందుకు బ్యాంకు ఖాతా వివరాలు అవసరం ఉంటుంది. కొంతమంది విద్యార్థులు ఈ మధ్య ఆ వివరాలను ఫేస్ బుక్ లో చాటింగ్ సమయాల్లో పోస్ట్ చేస్తున్నారంట. అలాంటి తప్పు ఎప్పుడూ చేయొద్దని వారు ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు.విన్నింగ్ టికెట్స్ ఆస్ట్రేలియాలో ఓ మహిళ తను గెలిచిన లాటరీ టికెట్ అని సంతోషాన్ని ఆపుకోలేక ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. పెద్ద ఎత్తున పార్టీ కూడా చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ టికెట్ ను కొందరు వ్యక్తులు మార్ఫింగ్ చేసి ఆమెకు తెలిసిన వారిలో కొందరు ఆ నగదు కొట్టేశారు. ఇంటి చిరునామా కొంతమంది ఇంటి చిరునామాను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నారంట. దీనివల్ల దొంగలకు తలుపులు బార్లా తెరిచినట్లే అవుతుందని అలాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు.పాస్ పోర్ట్ కూడా.. చాలామంది వ్యక్తులు తమ పాస్ట్ పోర్టు నెంబర్ కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నారని ఇది చాలా డేంజర్ అని అంటున్నారు.పిల్లల వివరాలు, ఫొటోలు చిన్నారుల వివరాలను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం అంతమంచిది కాదని అంటున్నారు. పిల్లల ఫొటోలు పోస్ట్ చేసినప్పుడు వాటికి లైక్స్ రావడమేమోగానీ.. అందులో కొంతమంది నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తారంట. అది చూసి మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉందని.. అలాంటివి అస్సలు పోస్ట్ చేయకూడదని అంటున్నారు.బాస్ కు ఫిర్యాదు ఒక ఉద్యోగి తన సంస్థకు, యజమానికి సంబంధించిన ఫిర్యాదులు ఎట్టి పరిస్థితుల్లో ఫేస్ బుక్ లో పోస్ట్ చేయొద్దంట. అలా చేయడం వల్ల ఆ ఉద్యోగికి భవిష్యత్తులో కూడా సమస్యలు వస్తాయంట. అలాగే, ఫేస్ బుక్ ద్వారా ప్రైవేట్ సంభాషణ ఎప్పుడూ చేయొద్దంట.కాపీ అండ్ పేస్ట్ స్టేటస్ ఫేస్ బుక్ లో కాపీ పేస్ట్ చేయొద్దని చెప్తున్నారు. అలా చేయడం వల్ల తమ కంటెంట్ దొంగిలించారని దానికి సంబంధించిన వ్యక్తులు కేసులు పెట్టే ప్రమాదం కూడా లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్