ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో భార‌త్‌..

- March 05, 2025 , by Maagulf
ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో భార‌త్‌..

దుబాయ్: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భార‌త జ‌ట్టు జైత్ర యాత్ర కొన‌సాగుతోంది. వ‌రుస విజ‌యాల‌తో ఫైన‌ల్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఆస్ట్రేలియా పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. త‌ద్వారా 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకున్న‌ట్లైంది.

265 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ 48.1 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భార‌త బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (84; 98 బంతుల్లో 5 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ (45), కేఎల్ రాహుల్ (42 నాటౌట్‌) లు రాణించారు. అక్ష‌ర్ ప‌టేల్ (27), రోహిత్ శ‌ర్మ (28) లు ఫ‌ర్వాలేద‌నిపించారు. శుభ్‌మ‌న్ గిల్ (8) విఫ‌లం అయ్యాడు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో ఆడ‌మ్ జంపా రెండు వికెట్లు తీశాడు. కూపర్ కొన్నోలీ, నాథన్ ఎల్లిస్, బెన్ ద్వార్షుయిస్ లు త‌లా ఓ వికెట్ తీశారు.

ఇక ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య లాహోర్ వేదిక‌గా జ‌రగ‌నున్న రెండో సెమీఫైన‌ల్ మ్యాచ్ విజేత‌తో భార‌త్ పైన‌ల్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఫైన‌ల్ మ్యాచ్ ఆదివారం (మార్చి 9న‌) దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com