ఏపీలో మహిళల రక్షణకు 'శక్తి' యాప్
- March 05, 2025
అమరావతి: మహిళల రక్షణ కోసం శక్తి యాప్‌ను అందులోకి తెస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. పని చేసే ప్రదేశాల లో మహిళలపై లైంగిక వేధింపుల గురించి వైసీపీ సభ్యురాలు వరుదు కళ్యాణి అడిగిన ప్రశ్నకు హోం మంత్రి సమాధానమిస్తూ మహిళ రక్షణకు టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈనెల 8న మహిళా దినోత్సవం సం దర్భంగా సీఎం చంద్రబాబు శక్తి యాప్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు చెప్పారు. నెట్వర్క్ లేని ప్రాంతాల్లో సైతం ఈ యాప్ పనిచేసే విధంగా రూపకల్పన చేసినట్లు మంత్రి చెప్పారు. పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం 2013 పీఓ ఎస్చ్ చట్టం అమలు చేస్తున్నట్లు చెప్పారు. మహిళల రక్షణే ధ్యేయంగా ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసే వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!







