‘GAIL’లో జాబ్స్
- March 05, 2025
గెయిల్ జాబ్స్ పడ్డాయి.. ఆసక్తిగల అభ్యర్థులు అప్లయ్ చేసుకోవచ్చు.గేట్ స్కోరు ఉన్నవారే అర్హులు. ఈ పోస్టులకు ఎంపిక అయినవారికి నెలకు రూ.లక్షా 80వేల వరకు జీతం వస్తుంది. న్యూఢిల్లీలోని ప్రభుత్వరంగ సంస్థ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.
మొత్తం 73 ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ జాబ్స్ ప్రకటించింది.అయితే,ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా గేట్-2025 స్కోరు ఉండాలి.ఈ గేట్ స్కోరు ఆధారంగానే ఆయా పోస్టుల్లో ఖాళీలకు ఎంపిక చేస్తారు. ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల్లో అనేక విభాగాలు ఉన్నాయి. కెమికల్లో 21 ఖాళీలు, ఇన్స్ట్రుమెంటేషన్ 17 ఖాళీలు, ఎలక్ట్రికల్ విభాగంలో14 ఖాళీలు, మెకానికల్ విభాగంలో 8 ఖాళీలు, బీఐఎస్లో 13 ఖాళీలు ఉన్నాయి.
గెయిల్ అర్హతలివే:
గెయిల్ పోస్టుల కోసం అప్లయ్ చేసే అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్లో 65 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే గేట్-2025 స్కోరు కూడా తప్పనిసరి. అందులోనూ ఫుల్టైమ్ రెగ్యులర్ కోర్సు మాత్రమే చేసి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ చేసినవారు కూడా అర్హులే.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







