ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..
- March 06, 2025
భారత ఆర్మీలో ఉద్యోగాలు పడ్డాయి. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే చాలు..ఉద్యోగంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 2025 ద్వారా మహిళలు, పురుషులు
లెఫ్టినెంట్ హోదాలో ఆర్మీ ఉద్యోగంలో చేరవచ్చు. అర్హతలు, ఎంపిక విధానం, శిక్షణ వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మొత్తం 76 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలివే:
కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేయాలి
ఎన్సీసీ ‘C’ సర్టిఫికేట్లో బి-గ్రేడ్
వయసు: 19 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య (జూలై 2, 2000 నుంచి జూలై 1, 2006)లో జన్మించాలి
ఎంపిక ప్రక్రియ:
- అకడమిక్ మార్కులతో దరఖాస్తుల పరిశీలన చేసి షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.
- బెంగళూరులో రెండు దశల్లో 5 రోజుల పాటు ఇంటర్వ్యూలు
- ఇంటర్వ్యూలో ఎంపికైనవారికి మెడికల్ టెస్టులు
ట్రైనింగ్, వేతనం:
- చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ 49 వారాల ట్రైనింగ్
- ట్రైనింగ్ సమయంలో నెలకు స్టైపెండ్ రూ. 56,100 పొందవచ్చు.
- ట్రైనింగ్ తర్వాత లెఫ్టినెంట్ హోదాతో జాబ్‌లో జాయిన్ కావొచ్చు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో ADNOC నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- తెలంగాణ, ఏపీ మీదుగా మరో 2 అమృత్ భారత్ రైళ్లు!
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ముకు యూఏఈ నేతల శుభాకాంక్షలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్‌లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్‌కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్‌లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!







