నాలుగు ఏళ్లలో సౌదీ అరేబియాకు 2.5 మిలియన్ల క్రీడా పర్యాటకులు..!!
- March 06, 2025
రియాద్: సౌదీ అరేబియా గత నాలుగు సంవత్సరాలలో 2.5 మిలియన్ల క్రీడా పర్యాటకులను స్వాగతించింది. విజన్ 2030లో భాగంగా 80 అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను నిర్వహించిందని పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ తెలిపారు. ప్రపంచ క్రీడా పర్యాటక పరిశ్రమలో పెరుగుతున్న సౌదీ పాత్రను హైలైట్ చేశారు. ఇది ఇప్పుడు ప్రపంచ పర్యాటక వ్యయంలో 10% వాటా కలిగి ఉంది. 2030 నాటికి 17.5% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియా ప్రపంచ క్రీడా పర్యాటక రంగంలో కీలక పాత్ర పోషించిందని,ప్రపంచవ్యాప్తంగా అభిమానులు మరియు అథ్లెట్లను ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. జెడ్డాలో జరిగిన ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ వంటి కార్యక్రమాలు 160 దేశాల నుండి సందర్శకులను ఆకర్షించింది. ఇవి 20,000 ఉద్యోగ అవకాశాలను సృష్టించాయి. ఆర్థిక వ్యవస్థకు SR900 మిలియన్లను అందించాయి. WWE సూపర్ షోడౌన్, సౌదీ ప్రో గోల్ఫ్ ఛాంపియన్‌షిప్, బ్యాటిల్ ఆఫ్ ది ఛాంపియన్స్, ఫార్ములా E, ఇంటర్నేషనల్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ సూపర్ గ్లోబ్, సౌదీ ఇంటర్నేషనల్ మీటింగ్ ఫర్ డిజేబిలిటీస్ స్పోర్ట్ వంటి విభిన్న శ్రేణి ప్రధాన క్రీడా పోటీలను కూడా సౌదీ అరేబియా నిర్వహించి విజయవంతం చేసింది. 2030 నాటికి సౌదీ అరేబియా ఏటా 150 మిలియన్ల అంతర్జాతీయ పర్యాటకులను స్వాగతించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







