‘కోర్ట్’ సినిమా ట్రైలర్ రిలీజ్..
- March 07, 2025
నాని ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూ తన వాల్ పోస్టర్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాని కోర్ట్ అనే సినిమాతో రాబోతున్నాడు. ప్రియదర్శి మెయిన్ లీడ్ లో హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, హర్ష వర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మాణంలో రామ్ జగదీశ్ దర్శకత్వంలో ఈ కోర్ట్ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే కోర్ట్ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు. మీరు కూడా కోర్ట్ ట్రైలర్ చూసేయండి..
ట్రైలర్ చూస్తుంటే.. ఓ యువకుడిపై పలు రకాల సెక్షన్స్ లో కేసులు, ఆఖరికి పోక్సో కేసు కూడా పెట్టి అరెస్ట్ చేస్తారు. అయితే అతను తప్పు చేయకుండా అక్రమంగా ఇరికించారు, అతన్ని కాపాడటానికి ఓ లాయర్ వచ్చి ఏం చేసాడు అనే కథాంశంతో ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా మార్చ్ 14న రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల