మహిళా దినోత్సవం

- March 08, 2025 , by Maagulf
మహిళా దినోత్సవం

మహిళా దినోత్సవం.
మహిళ  మహిళ  మహిళ 
నీకు ఆనందోత్సవం.

పుట్టినపుడు నువ్వుశ్రీలక్ష్మి.
ఎదుగుతున్నపుడు నువ్వు అదృష్టలక్ష్మి.
పెళ్ళీడు వచ్చినపుడు నువ్వు సౌందర్యలక్ష్మి.

పెళ్ళి అయినపుడు నువ్వు గృహలక్ష్మి.
రౌడీలను ఎదిరించినపుడునువ్వు ధైర్యలక్ష్మి.
పిల్లలను కన్నప్పుడు నువ్వు సంతానలక్ష్మి.
పంట చేతికొచ్చినపుడు నువ్వు ధాన్యలక్ష్మి.

ఓ మహిళా నీకు నువ్వేసాటి.
మహిళకు ఎవ్వరు రాలేరు పోటి.

9-15మద్య వేయించుకోవాలి టీక.
టీకాతో సెరైకల్ కాన్సర్ రాదిక.

కట్నం అడిగితే నొక్కాలి వాడి పీక.
కామాంధులకు పెట్టించాలి గావుకేక.

మహిళా నీవు సాధించలేనిది ఏదీ లేదు.
పోలీస్ నుంచి మేజర్ వరకు నీకు తేడా లేదు.

నర్సు నుంచి డాక్టర్ వరకు నీవృధ్దికి అంతేలేదు.
సర్పంచ్ నుంచి రాష్ట్రపతి వరకు నీకు జవాబు లేదు.
అంతరిక్ష పయనంలో నీకు పోటీయే లేదు.
ఇలా అన్ని రంగాలలో నీకు తిరుగేలేదు.

మహిళా నువ్వు భరించిన ప్రసవ వేదన.
నొప్పులతో పడతావు అధిక యాతన.
ఆడపిల్లైతే నీదే తప్పన్న వాదన.
నీ తప్పు కాదని తెలిసి నీకు ఆవేదన.

పాలిచ్చి శిశువుకి యిస్తావు ఆలన.
సక్రమంగా ఉండాలని చేస్తావు పాలన.
మహిళా , ఓ మహిళా నీకు అభినందన.

మహిళా నీకు ఎన్నోఅవతారాలు.
తల్లిగా పిల్లలపై చూపిస్తున్న మురిపాలు.
భర్తను అలరిస్తూ చేస్తావు సరసాలు.
అత్తమామలకు అందిస్తావు మమకారాలు.

చుట్టాలొస్తే వడ్డిస్తావు పరమాన్నాలు.
పిల్లలను పెంచుతూ అందిస్తావుఅనురాగాలు.
అమ్మమ్మ,నానమ్మగా వలకపోస్తావు గారాలు.
అక్కగా అన్నదమ్ములకు అందిస్తావు ఆత్మీయతలు.

బంధువులు నీపై చేస్తుంటారు కుతంత్రాలు.
వాటిని తిప్పికొట్టగలిగే నీ చాకచక్యాలు.
ఈ క్రమంలో నువ్వు చేస్తావు ఎన్నో త్యాగాలు.

అందుకే అంటారు ఇంటికి దీపం ఇల్లాలు.
మహిళా , ఓ మహిళా నీకు బహు అభినందనలు.

డా.జి.వి.రావు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com