'కిస్ కిస్ కిస్సిక్' ట్రైలర్ రిలీజ్

- March 08, 2025 , by Maagulf

మోస్ట్ ఎవైటెడ్ హోల్స్సమ్ హిందీ ఎంటర్ టైనర్ 'పింటు కి పప్పీ' దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించనుంది. మార్చి 21న, ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో కిస్ కిస్ కిస్సిక్ టైటిల్ తో విడుదల కానుంది.

అద్భుతమైన ట్రాక్ రికార్డ్ వున్న  మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మల్టీ లాంగ్వెజ్ లో గ్రాండ్ రిలీజ్ చేస్తోంది.ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది, ప్రేక్షకులకు హిలేరియస్ రోలర్ కోస్టర్ రైడ్ కు హామీ ఇస్తుంది.

పింటు ఒక వింత సమస్య వుంటుంది - అతను ముద్దు పెట్టుకునే ప్రతి మ్మాయి చివరికి వేరొకరిని వివాహం చేసుకుంటుంది! అతను ఒక ధైర్యవంతురాలైన యువతిని కలిసినప్పుడు అతని జీవితం ఒక మలుపు తిరుగుతుంది,ట్రైలర్ ఫన్నీ, రొమాంటిక్ ,యాక్షన్-ప్యాక్డ్ ఎలిమెంట్స్ తో కట్టిపడేసింది.  

శివ్ హరే దర్శకత్వం వహించిన కిస్ కిస్ కిసిక్ లో శుశాంత్, జాన్య జోషి, వీధి వంటి కొత్త ప్రతిభను పరిచయం చేయగా, విజయ్ రాజ, మురళీ శర్మ వంటి అనుభవజ్ఞులైన నటులు ఈ ప్రాజెక్టుకు తమ నైపుణ్యాన్ని అందించారు.ఈ చిత్రాన్ని గణేష్ ఆచార్య భార్య విధి ఆచార్య (V2S ప్రొడక్షన్) నిర్మిస్తున్నారు, ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ గణేష్ ఆచార్య స్వయంగా కొరియోగ్రఫీ చేస్తున్నారు.

లవ్ యాక్షన్ హ్యుమర్ బ్లెండ్ తో కిస్ కిస్ కిసిక్ దక్షిణ భారత సినీ ప్రియులను లరించడానికి సిద్దంగా వుంది.

తారాగణం: శుశాంత్, జాన్యా జోషి, విధి , విజయ్ రాజ్, మురళీ శర్మ, అలీ అస్గర్, సునీల్ పాల్, అజయ్ జాదవ్, పూజ బెనర్జీ, అదితి సన్వాల్, రియా ఎస్ సోని, ఊర్వశి చౌహాన్, ప్యూమోరి మెహతా దాస్, ముక్తేశ్వర్ ఓజా & గణేష్ ఆచార్య

సాంకేతిక సిబ్బంది:
నిర్మాత: విధి ఆచార్య
బ్యానర్: V2S ప్రొడక్షన్ & ఎంటర్‌టైన్‌మెంట్
దర్శకత్వం: శివ్ హరే
సమర్పణ: మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్
సహ నిర్మాత: DR. NITZ or  NITIN 'NITZ' ARORA
డీవోపీ: అజయ్ పాండే
ఎడిటర్ - మనోజ్ మగర్
సంగీతం: DR. NITZ a.k.a నితిన్ 'NITZ' అరోరా & సోనీ Kc, ప్రసాద్ S. షఫాత్ అలీ, సోనాల్ ప్రధాన్ & అంకిత్ శర్మ–అభినవ్ ఠాకూర్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్ ఏజెన్సీ (సౌత్) - ఫస్ట్ షో

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com