న్యూజిలాండ్‌కు షాక్..గాయపడిన కేన్ విలియమ్సన్..
- March 09, 2025
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు. దీంతో అతడు రెండో ఇన్నింగ్స్‌లో మైదానంలో అడుగుపెట్టలేదు.
కేన్ విలియమ్సన్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గ్రూప్ స్టేజీలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగులతో రాణించాడు. అనంతరం సెమీస్‌లో దక్షిణాఫ్రికా పై శకతంతో చెలరేగాడు. ఈ క్రమంలో కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో కేన్ మామ శకతంతో చెలరేగుతాడని జట్టు కివీస్ మేనేజ్‌మెంట్ భారీ ఆశలనే పెట్టుకుంది. అయితే.. కేన్ మామ నిరాశపరిచాడు.
ఫైనల్ మ్యాచ్‌లో 14 బంతులను ఎదుర్కొన్న కేన్ విలియమ్సన్ 1 ఫోర్ బాది 11 పరుగులు మాత్రమే చేశాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. తక్కువ పరుగులకే ఔట్ కావడంతో కేన్ మామ నిరాశ చెందాడు. తల అడ్డంగా ఊపుతూ పెవిలియన్‌కు నడకసాగించాడు.
కివీస్ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత భారత్ లక్ష్య ఛేదనకు దిగింది. అయితే.. కేన్ మామ ఫీల్డింగ్‌కు రాలేదు. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు క్వాడ్ స్ట్రెయిన్ గురి అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడి స్థానంలో మార్క్ చాప్‌మన్ ఫీల్డింగ్‌కు వచ్చాడు.
ఈ విషయాన్ని కివీస్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ‘బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కేన్ క్వాడ్ స్ట్రెయిన్‌కు గురి అయ్యాడు. అందుకనే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్‌లో పీల్డింగ్‌కు రాలేదు. అతడి స్థానంలో చాప్‌మన్ ఫీల్డింగ్ చేస్తాడు.’ అని కివీస్ బోర్డు తెలిపింది.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







