జనవరిలో QR4.3 బిలియన్లు దాటిన మార్టిగేజ్ లావాదేవీలు..!!

- March 10, 2025 , by Maagulf
జనవరిలో QR4.3 బిలియన్లు దాటిన మార్టిగేజ్ లావాదేవీలు..!!

దోహా, ఖతార్: ఈ సంవత్సరం జనవరిలో ఖతార్‌లోని రియల్ ఎస్టేట్ రంగం మార్టిగేజ్ లావాదేవీల పరిమాణం 149 లావాదేవీలను నమోదు చేసింది. వీటి విలువ మొత్తం QR4.391 బిలియన్లు. మొత్తం మార్టిగేజ్ పెట్టిన ఆస్తుల సంఖ్యలో దోహా మునిసిపాలిటీ అత్యధికంగా తనఖా లావాదేవీలను నమోదు చేసింది (38.3 శాతాం), ఆ తరువాత అల్ రాయన్ మునిసిపాలిటీ 51 లావాదేవీలతో (34.2 శాతాం) రెండవ స్థానంలో ఉంది. అల్ ధాయన్ మునిసిపాలిటీ మొత్తం తనఖా పెట్టిన ఆస్తుల సంఖ్యలో 15 లావాదేవీలతో (10.1 శాతం) మూడో స్థానంలో ఉందని న్యాయ మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది.

జనవరి 2025లో తనఖాల విలువ విషయానికొస్తే.. దోహా మునిసిపాలిటీ QR2.748 బిలియన్లతో మొదటి స్థానంలో ఉండగా, ఉమ్ సలాల్ మునిసిపాలిటీ QR23.054 మిలియన్లకు చేరుకుని అత్యల్ప విలువను నమోదు చేసింది. ఇంతలో అల్ రేయాన్ మునిసిపాలిటీ QR616 మిలియన్లు, అల్ వక్రా QR609 మిలియన్లు, అల్ ధాయేన్ QR348 మిలియన్లు, అల్ ఖోర్, ధకీరా QR44.254 మిలియన్లుగా ఉంది.  ఈ డేటా ఖతారీ ఆర్థిక వ్యవస్థ పునాదుల దృఢత్వాన్ని తెలియజేస్తుందని, రియల్ ఎస్టేట్ రంగం నిరంతర వృద్ధిని కూడా నిర్ధారిస్తుందని అధికార యంత్రాంగం వెల్లడించింది.  2024లో మార్టిగేజ్ లావాదేవీల పరిమాణం 1,492 లావాదేవీలతో మొత్తం QR64 బిలియన్లుగా నమోదైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com