ఆగస్టు 15న ప్రారంభింకానున్న 'స్వయం'
- July 04, 2016
సామూహిక ఓపెన్ ఆన్లైన్ కోర్సుల (మూక్) ప్లాట్‌ఫామ్ 'స్వయం'ను ఆగస్టు 15న ప్రారంభించాలని మానవ వనరుల శాఖ యోచిస్తోంది. మైక్రోసాఫ్ట్ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని, పంద్రాగస్టున్న ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ లాంఛనంగా ఆరంభించే అవకాశం ఉందని శాఖ వర్గాలు తెలిపాయి. సమాచార సాంకేతికతతో నడిచే వ్యవస్థ 'స్వయం'లో 2 వేలు పైబడిన కోర్సులు 3 కోట్ల మంది విద్యార్థులకు ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉంటాయి.9-12 తరగతుల నుంచి డిగ్రీ , పీజీ విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదువుకోవచ్చు. ఒకేసారి 10 లక్షల మంది విద్యార్థులు ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా వినియోగించుకునేలా సాయపడే నె ట్‌వర్క్ దీనిలో భాగం కానుంది. ఈ ప్రాజెక్టు సాకారమైతే రెండున్నర లక్షల గంటల పైబడిన ఈ-సమాచారం అందుబాటులోకి వస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ పాఠ్యాంశ వనరుగా రికార్డు సృష్టిస్తుంది. ఈ కోర్సుల ద్వారా సాధించిన క్రెడిట్లు విద్యార్థుల కాలేజీలు, పాఠశాలలకు పంపిస్తారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







