విమానంలో అల్లాహు అక్బర్ అని అరిచి జైలు పాలయ్యాడు
- July 04, 2016
అవును.. గాల్లో విమానం వెళ్తున్నప్పుడు ప్రయాణికుల్లో ఎవరైనా 'అల్లాహు అక్బర్' అని అరిస్తే.. ఇంకేమైనా ఉందా. ప్రయాణికులు బెంబేలెత్తిపోతారు. ఉగ్రవాది ఏమోనని వణికిపోతారు. ఎందుకంటారా.. ఇటీవల దాడులకు ముందు తీవ్రవాదులు 'అల్లాహు అక్బర్' అని అరుస్తున్నారు కాబట్టి. ఇదే అనుభవం దుబాయ్ నుంచి బర్మింగ్‌హామ్ వెళ్తున్న ఎమిరేట్స్‌కు చెందిన బోయింగ్ 777 విమానంలో ప్రయాణికులకు ఎదురైంది. ఫిబ్రవరి 1న ఈ ఘటన జరిగింది. 347 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో 38 ఏళ్ల షెహ్రాజ్ సర్వార్ కూడా ఉన్నాడు. విమానం గాల్లో ఉండగా సర్వార్ ఒక్కసారిగా 'అల్లాహు అక్బర్' అని గట్టిగా అరిచాడు. అంతే విమానంలో ఉగ్రవాది ఉన్నాడని భావించిన ప్రయాణికులు, విమాన సిబ్బంది ఇక తమ పని అయిపోయిందని అనుకున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయంతో వణికిపోయారు. కొందరైతే ఏడ్చేశారు కూడా. టేకాఫ్ సమయంలోనూ అతను వింతగా ప్రవర్తించాడు. సిబ్బంది సీటు బెల్టు పెట్టుకోమంటే రెండు సార్లు తిరస్కరించాడు. ఆహార పదార్థాలను కేబిన్‌లో విసిరికొట్టాడు. ఆ తర్వాత విమానం బర్మింగ్‌హాం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతున్నప్పుడు మరోమారు 'భూం' అంటూ పెద్దగా అరిచాడు. అతడి అనుమానాస్పద ప్రవర్తనపై విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు. కేసును విన్న బర్మింగ్‌హాం క్రౌన్ కోర్టు రెండు నెలల తర్వాత తుదితీర్పు వెల్లడించింది. సర్వార్ను దోషిగా తేలుస్తూ పది వారాల జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







