కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ
- March 10, 2025
కెనడా: కెనడా లిబరల్ పార్టీ దేశ తదుపరి ప్రధానమంత్రిగా మార్క్ కార్నీని అత్యధిక మెజారిటీతో ఎన్నుకుంది.జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్ కార్నీని ఎన్నుకున్నారు. తుది లెక్కల ప్రకారం, లిబరల్ పార్టీ నాయకత్వ ఓట్లలో పోలైన బ్యాలెట్లలో కార్నీ 85.9% సాధించి గెలిచారు. జస్టిన్ ట్రూడో స్థానంలో కార్నీ బాధ్యతలు స్వీకరించి, కొంత కాలం మాత్రమే ఆ పదవిలో ఉంటాడు. ఎందుకంటే కెనడాలో అక్టోబర్ నాటికి ఎన్నికలు నిర్వహించాలి. విజయోత్సవ సభలో కార్నీ మాట్లాడుతూ…ట్రంప్ నేతృత్వంలోని యునైటెడ్ స్టేట్స్(US) కెనడాను నియంత్రణ సాధించేందుకు ప్రయత్నిస్తోందని హెచ్చరించారు. ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని తెలిపారు. యుఎస్ కెనడా వనరులను, నీటిని, భూమిని, దేశాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. కెనడియన్ కార్మికులు, కుటుంబాలు, వ్యాపారాల పై ట్రంప్ దాడి చేస్తున్నారని మండిపడ్డారు.
తాజా వార్తలు
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం
- భారత్లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!