ప్రారంభం కానున్న రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- March 10, 2025
న్యూఢిల్లీ:రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశం ఈరోజు ప్రారంభమవుతుంది. బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉంది.మణిపూర్లో హింసాత్మక సంఘటనలు, నియోజకవర్గాల పునర్విభజన, హిందీ భాష విధించడం, అమెరికన్ ఉత్పత్తుల దిగుమతి సుంకాన్ని తగ్గించాలనే నిర్ణయం వంటి అంశాలపై పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలదేసే అవకాశం ఉంది. మరోవైపు మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు పార్లమెంటు ఆమోదం కోసం హోంమంత్రి అమిత్ షా తీర్మానాన్ని ప్రవేశపెడతారని తెలుస్తోంది. మణిపూర్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు. వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఫిబ్రవరిలో మొదటి బడ్జెట్ సమావేశం ముగిసిన సంగతి విదితమే.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







