బహ్రెయిన్‌లో ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రవాసుల ఆసక్తి..!!
- March 10, 2025
మనామా: గోల్డెన్ రెసిడెన్సీ పథకం, ఇక్కడ రియల్ ఎస్టేట్ మరింత సురక్షితమైన పెట్టుబడిని అందిస్తుందనే భావన పెరుగుతున్నందున, ప్రవాసులు అద్దె మార్కెట్ నుండి వైదొలిగి బహ్రెయిన్‌లోని ఆస్తిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ మేరకు సావిల్స్ నివేదిక వెల్లడించింది. రియల్ దూకుడుతో సంవత్సరంలో లగ్జరీ ఫ్లాట్ల ధర 1.4 శాతం పెరిగింది. సంపన్న కొనుగోలుదారులు ప్రీమియం ఫీచర్లతో కూడిన హై-ఎండ్ ఇళ్లను ఎంచుకుంటున్నారని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా అద్దెలు 23 శాతం పెరిగాయి. దాదాపు సగం లీజులు క్యాపిటల్ గవర్నరేట్‌లో కేంద్రీకృతమై ఉన్నాయి.
డియార్ అల్ ముహారక్, మనామా వాటర్‌ఫ్రంట్, జుఫైర్ పెట్టుబడిదారులను ఆకర్షిస్తూనే ఉన్నాయని, డెవలపర్లు నివాస, రిటైల్, వాణిజ్య స్థలాలు ఉండేలా కొత్త ప్రాపర్టీలకు డిమాండ్ ఎక్కువగా ఉందని పేర్కొంది. పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ గృహనిర్మాణానికి అదనంగా 208,000 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది. అయితే, 2025 లో పూర్తి కానున్న సాయా కార్ప్ టవర్, ఫ్యూచర్ జనరేషన్ టవర్ వంటి కొత్త ప్రాజెక్టులు మార్కెట్లో మార్పులను తీసుకువస్తాయని భావిస్తున్నారు.
పారిశ్రామిక రంగంలో తయారీని బలోపేతం చేయడానికి బహ్రెయిన్ చేస్తున్న ప్రయత్నాలు గిడ్డంగులకు డిమాండ్‌ను పెంచాయి. పెద్ద నిల్వ స్థలాల అద్దె ఖర్చులు 2.1 శాతం పెరిగాయి. చిన్న యూనిట్ల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక వృద్ధికి కీలకమైన బహ్రెయిన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కొత్త మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతున్నట్లు నివేదిక హైలైట్ చేసింది.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







