మరోసారి బాంబులతో మారుమోగిన సౌదీ
- July 04, 2016
సౌదీ అరేబియాలో మరోసారి ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఖతీఫ్ లోని ఓ ప్రార్థనా మందిరంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ బాంబు పేలుళ్లలో పలువురు చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. మదీనాలోని సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, సోమవారం ఉదయం జెడ్డాలో తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.జెడ్డాలోని అమెరికా విదేశాంగ కార్యాలయం సమీపంలో ఓ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. అతడిని నిలువరించే క్రమంలో ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. కాగా, బాంబర్ మాత్రం తునాతునకలయ్యాడు. యూఎస్ కాన్సులేట్ సమీపంలో ఉన్న మసీదు వైపుగా వెళుతూ అతడు ఈ ఘాతుకానికి దిగాడు.


తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ







