బహ్రెయిన్ లో 1,177 తనిఖీలు.. 15మంది అరెస్ట్..!!

- March 11, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో 1,177 తనిఖీలు.. 15మంది అరెస్ట్..!!

మనామా: 2025 మార్చి 2 నుండి 8 వరకు 1,177 తనిఖీలను నిర్వహించినట్లు లేబర్ మార్కెట్ నియంత్రణ సంస్థ (LMRA) ప్రకటించింది.ఈ సందర్భంగా 15 మందిని అరెస్టు చేయగా, 71 మంది ఉల్లంఘనదారులను బహిష్కరించారు. బహ్రెయిన్ రాజ్యంలోని లేబర్ మార్కెట్ నియంత్రణ సంస్థ.. రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనలకు సంబంధించి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.

అన్ని గవర్నరేట్‌లలోని వివిధ దుకాణాలపై 1,170 తనిఖీ సందర్శనలు జరిగాయని, క్యాపిటల్ గవర్నరేట్‌లో 3 చోట్ల, ముహారక్ గవర్నరేట్‌లో, నార్తర్న్ గవర్నరేట్‌లో రెండు చోట్ల, సదరన్ గవర్నరేట్‌లో తనిఖీలు నిర్వహించినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. ఇందులో జాతీయత, పాస్‌పోర్ట్‌లు, రెసిడెన్సీ వ్యవహారాలు (NPRA), అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గవర్నరేట్ సంబంధిత పోలీసు డైరెక్టరేట్ పాల్గొందని తెలిపింది. దేశ ఆర్థిక, సామాజిక భద్రతకు హాని కలిగించే ఏవైనా ఉల్లంఘనలను  గుర్తించేందుకు ప్రభుత్వ సంస్థలతో ఉమ్మడిగా  తనిఖీలు కొనసాగుతుందని అథారిటీ స్పష్టం చేసింది.

అథారిటీ వెబ్‌సైట్ www.lmra.gov.bh లోని ఎలక్ట్రానిక్ ఫారమ్ ద్వారా లేదా 17506055 నంబర్‌లో అథారిటీ కాల్ సెంటర్‌కు కాల్ చేయడం ద్వారా సూచనలు, ఫిర్యాదుల వ్యవస్థ (తవాసుల్) ద్వారా ఉల్లంఘనలను నివేదించాలని కోరింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com