వాట్సాప్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త..
- March 11, 2025
ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. మీకు వాట్సాప్ అకౌంట్ ఉందా? తస్మాత్ జాగ్రత్త. మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ చేశారనే డౌట్ ఉందా? మీకు తెలియకుండానే వాట్సాప్ అకౌంట్‌లో మెసేజ్‌లు వస్తున్నాయా? మీరు పంపినట్టుగా వెళ్తున్నాయా? అయితే, అనుమానమే లేదు.. మీ వాట్సాప్ హ్యాక్ అయినట్టే.. ప్రస్తుతం కోట్లాది మంది వాట్సాప్ వాడుతున్నారు.
తమ వ్యక్తిగత సమాచారాన్ని కూడా వాట్సాప్‌లో షేర్ చేస్తుంటారు. కానీ, సైబర్ మోసాల కారణంగా మీ వాట్సాప్‌లో డేటా లీక్ అయ్యే ప్రమాదం భారీగా పెరిగింది. మెసేజ్‌లు, ఫోన్ నంబర్లు, ఫొటోలు, వీడియోలతో సహా అనేక పర్సనల్ డేటా వాట్సాప్‌లో సేవ్ చేస్తుంటారు. మీ ఫోన్ హ్యాక్ అయితే..ఈ వ్యక్తిగత సమాచారం సులభంగా హ్యాకర్లకు చేరుతుంది.
అయితే, ఈ రోజుల్లో వాట్సాప్‌లో కొత్త రకమైన మోసాలకు పాల్పడుతున్నారు హ్యాకర్లు. మీకు తెలిసిన వ్యక్తిలా మీకు వాట్సాప్‌లో ఒక కోడ్ పంపుతారు. ఆ కోడ్ మీ ఫోన్‌లో డిలీట్ అయిందని చెప్పి వెనక్కి ఫార్వార్డ్ చేయమని అడుగుతారు. మీరు ఆ మెసేజ్ ఫార్వార్డ్ చేసిన వెంటనే మీరు వాట్సాప్‌పై కంట్రోల్ కోల్పోతారు.
చాలా సార్లు తమ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందని యూజర్లకు కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో యూజర్ల పర్సనల్ డేటా చాలా వరకు లీక్ అవుతుంది. మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఎలా అకౌంట్ రికవరీ చేసుకోవాలి? ఎలా నివారించాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.
వాట్సాప్ హ్యాక్ అయినట్లు సంకేతాలివే:
- వాట్సాప్ హ్యాక్ అయింది అనేందుకు ఫస్ట్ సంకేతం.. మీరు పంపని మెసేజ్‌లకు రిప్లేయ్ వస్తుంటాయి.
- మీ నంబర్ నుంచి గుర్తుతెలియని మెసేజ్‌లు వస్తున్నాయని మీ స్నేహితులు మీకు చెబుతారు.
- మీరు డిలీట్ చేయని మెసేజ్‌లు మీ చాట్ నుంచి ఆటో డిలీట్ అయిపోతాయి.
- వాట్సాప్ నుంచి సడెన్‌గా లాగ్ అవుట్ అవుతారు. మళ్ళీ లాగిన్ అయ్యేసరికి OTP అడుగుతుంది.
- మీకు తెలియకుండానే వాట్సాప్ గ్రూపుల్లో చేరినట్టుగా కనిపిస్తుంది.
- మీ అకౌంట్ నుంచి పోస్ట్ చేసిన స్టేటస్ లేదా స్టోరీని మీరు చూడవచ్చు.
- మీరు వాట్సాప్ సెక్యూరిటీ వెరిఫికేషన్ కోడ్ కోసం రిక్వెస్ట్ వస్తుంది.
- వాట్సాప్ ఎలా హ్యాక్ అవుతుంది? :
- హ్యాకర్లు సాధారణంగా వాట్సాప్ అకౌంట్‌ను రెండు విధాలుగా కంట్రోల్ చేస్తారు. లింక్డ్ డివైజ్‌ల ద్వారా మీ వాట్సాప్‌ను మరో డివైజ్‌కు లింక్ చేస్తారు. మీ వాట్సాప్‌లో అన్నింటిని ట్రాక్ చేయవచ్చు. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయడం ద్వారా హ్యాకర్ మీ వాట్సాప్ నంబర్‌ను తన ఫోన్‌లో రిజిస్టర్ చేసుకుంటాడు. దాంతో మీ అకౌంట్ నుంచి మీ డివైజ్ లాగ్ అవుట్ అవుతుంది. కానీ, పాత మెసేజ్‌లు మాత్రం హ్యాకర్లకు కనిపించవు.
వాట్సాప్ అకౌంట్ ఎలా రికవరీ చేయాలి?
మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందని మీకు అనిపిస్తే..వెంటనే మీ అకౌంట్ లింక్ అయి డివైసెస్ చెక్ చేసి వెంటనే లాగ్ అవుట్ అవ్వండి. వాట్సాప్‌ను తిరిగి ఇన్‌స్టాల్ చేయడండి. మీ నంబర్‌తో లాగిన్ అయి కొత్త ఓటీపీని ఎంటర్ చేయండి. హ్యాకర్ సెక్యూరిటీ పిన్ సెట్ చేసి ఉంటే.. (Forgot PIN) ఉపయోగించండి. మీ పేరుతో ఎవరైనా డబ్బు అడుగుతూ మెసేజ్‌లు పంపే అవకాశం ఉందని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులను ముందే హెచ్చరించండి.
ఎలా నివారించాలి?
- టూ-ఫ్యాక్టర్డ్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయండి.
- OTP ఎవరితోనూ షేర్ చేయొద్దు.
- అన్‌నౌన్ మెసేజ్ లేదా లింక్‌లపై క్లిక్ చేయొద్దు.
- వాట్సాప్ సెక్యూరిటీ సెట్టింగ్స్ అప్‌డేట్ చేయండి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







