మస్కట్‌లోని కీలక రహదారి పాక్షికంగా మూసివేత..!!

- March 13, 2025 , by Maagulf
మస్కట్‌లోని కీలక రహదారి పాక్షికంగా మూసివేత..!!

మస్కట్: సుల్తాన్ ఖబూస్ స్ట్రీట్‌లోని ముఖ్యమైన అల్-జాఫ్రా రౌండ్అబౌట్ తర్వాత (లోపలికి) ఖౌద్ వంతెన వైపు వెళ్లే రహదారిని పాక్షికంగా మూసివేసినట్టు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. మస్కట్ గవర్నరేట్‌లో కొనసాగుతున్న రహదారి నిర్వహణ కోసం ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మూసివేత ఆంక్షలు అక్టోబర్ 13 రాత్రి 10:00 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 14న ఉదయం 5:00 గంటల వరకు అమలులో ఉంటుంది.  వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ఆన్-సైట్ ట్రాఫిక్ సూచనలను పాటించాలని,  ఆంక్షలకు అనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com